విజయ్ GOATకి విజయకాంత్ 'రాజదురై' స్ఫూర్తి?
1993లో విడుదలైన విజయకాంత్ 'రాజదురై' కూడా విజయ్ 'గోట్' తరహా కథాంశాన్ని కలిగి ఉంది.
By: Tupaki Desk | 7 Sep 2024 4:04 AM GMTదళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన 'ది గోట్' చిత్రం ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి యథావిధిగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం, అతడి నటన అందరికీ నచ్చాయి. కానీ 'తండ్రి కొడుకుల వైరం' అనే 'కొత్త బాటిల్లో పాత వైన్' ఫార్ములాను రిపీట్ చేయడంపై విమర్శలు ఉన్నాయి. ఈ చిత్రం 1993లో విడుదలైన 'రాజదురై'తో పోలి ఉందని కథనాలొస్తున్నాయి.
1993లో విడుదలైన విజయకాంత్ 'రాజదురై' కూడా విజయ్ 'గోట్' తరహా కథాంశాన్ని కలిగి ఉంది. రెండు చిత్రాలూ తండ్రీకొడుకుల మధ్య జరిగే ఘర్షణ ప్రధానమైన థీమ్. GOAT హాలీవుడ్ చిత్రం నుండి ప్రేరణ పొందిన చిత్రం అని కూడా విశ్లేషిస్తున్నారు. విల్ స్మిత్ జెమినిమేన్ లోను ఈ తరహాలో ద్విపాత్రాభినయం కనిపిస్తుంది. విజయ్ కాంత్ నటించిన పాతకాలపు తమిళ చిత్రంలానే ఉందేమిటీ? అంటూ దళపతి అభిమానులు థియేటర్లలో ఆశ్చర్యపోతున్నారు. ఆసక్తికరంగా 'రాజదురై' చిత్రానికి విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించడం గమనార్హం. ఆసక్తికరంగా రాజదురైలో విజయ్ కాంత్ కి నివాళిగా అతడి ఏఐ విజువల్స్ ని ఉపయోగించుకుంది టీమ్.
ఇక ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రల్లో చిన్నప్పటి పాత్ర చాలా స్పెషల్ గా తీర్చిదిద్దారు. దీనిని చిత్రీకరించడానికి మేకర్స్ డీ-ఏజింగ్ టెక్నిక్‌ని ఉపయోగించారు. విజయ్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. అయితే నెగెటివ్ రోల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహ, యోగి బాబు, జయరామ్, మోహన్, వైభవ్, లైలా, ప్రేమి అమరేన్ తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్.