Begin typing your search above and press return to search.

నేను ప‌డుపు వృత్తిలో ఉన్నానా? నటి క‌న్నీళ్లు!

లైంగిక వేధింపుల కేసులో నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికే) చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ చెన్నై- వలసరవాక్కం పోలీసుల ఎదుట హాజరైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 March 2025 8:00 PM IST
నేను ప‌డుపు వృత్తిలో ఉన్నానా? నటి క‌న్నీళ్లు!
X

లైంగిక వేధింపుల కేసులో నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికే) చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ చెన్నై- వలసరవాక్కం పోలీసుల ఎదుట హాజరైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ న‌టి విజ‌య‌ల‌క్ష్మి త‌న‌ను సీమ‌న్ వేధించాడ‌ని కేసు వేయ‌డంతో రెండు రోజులుగా హై డ్రామా నెల‌కొంది. నాయకుడు సీమాన్ రెండు రోజుల క్రితం ధర్మపురి నుండి చెన్నైకి చేరుకుని పార్టీ క్యాడర్ మద్దతుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

అయితే తాజా ప్ర‌క‌ట‌న‌లో న‌టి విజ‌య‌ల‌క్ష్మి సె* వ‌ర్క‌ర్ అని, దానికి నా దగ్గర రుజువు ఉందని సీమాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. నటి విజయలక్ష్మి ఇచ్చిన లైంగిక ఫిర్యాదు కేసులో సీమాన్‌పై చెన్నైలోని వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతోంది.

పోలీసులు సీమాన్‌ను 1.15 గంటల పాటు పలు ప్రశ్నలు వేసి ఒప్పుకోలు తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలంటూ సీమాన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలు కేసులో విచార‌ణ సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో సీమాన్ విలేకరులతో సమావేశమయ్యారు. నన్ను సె* అపరాధి అని ఎలా అంటారు? మీరు ఎలాంటి న్యాయమూర్తి? విచారణ జరుగుతున్నప్పుడు మీరు నన్ను ఎలా దోషిగా నిర్ధారిస్తారు? స్త్రీ చెప్పినంత మాత్రాన అంతా నిజమవుతుందా? అంటూ సీమాన్ ఆవేశంగా ప్ర‌శ్నించారు.

నా కన్నీళ్లు ఆగవు!

అయితే నటి విజయలక్ష్మి కన్నీళ్లతో కూడిన వీడియోను విడుదల చేశారు. అందులో ``నేను ఎలాంటి సె* వర్కర్‌ను సీమాన్‌? మీరు నన్ను సె* వర్కర్ అని పిలిచావు.. మీరు ఈ రోజు వరకు తప్పించుకొని ఉండవచ్చు కానీ ఇక నుండి తప్పించుకోలేరు. నా కన్నీళ్లు నిన్ను ఏం చేస్తాయో చూడు... నా కన్నీళ్లు నిన్ను వదలవు`` అని విజయలక్ష్మి శాప‌నార్థాలు పెట్టారు. ఈరోజు కోర్టు లో త‌దుప‌రి విచార‌ణ సాగ‌నుంది.