Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌న్ స‌హా అత‌డి భార్య‌పైనా కొత్త‌గా మ‌రో కేస్!

ఇప్ప‌టికే ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ తూగ‌దీప రేణుకాస్వామి హ‌త్య కేసులో ఏ2గా ఉన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jun 2024 7:02 AM GMT
ద‌ర్శ‌న్ స‌హా అత‌డి భార్య‌పైనా కొత్త‌గా మ‌రో కేస్!
X

ఇప్ప‌టికే ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ తూగ‌దీప రేణుకాస్వామి హ‌త్య కేసులో ఏ2గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోలీసుల క‌స్ట‌డీలో విచార‌ణ ఎదుర్కుంటున్నాడు. అత‌డిని ఎలాగైనా బ‌య‌ట‌కు తీసుకురా వాలని భార్య విజ‌య‌ల‌క్ష్మి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టాప్ లాయ‌ర్ల‌ను రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భ‌ర్త‌ను కాపాడుకోవాల‌ని తాను చేయాల్సిన అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చ‌ట్ట ప‌రంగా చేస్తున్నారు.

కానీ ఇప్పుడు ఆమెపై కూడా కేసు న‌మోదైంది. ఏకంగా ఏ1గానే విజ‌య‌ల‌క్ష్మి పై కేసు ఫైల్ అయింది. దీంతో విజ‌య‌ల‌క్ష్మి కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డటం సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు ఆమెపై ఛార్జ్ షీట్ కి రెడీ అవుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే...గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో ద‌ర్శ‌న్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి అక్ర‌మంగా ఉంచిన బార్ హెడ్డ్ గూస్ ( మంగోలియా జాతికి చెందిన లేత బూడిద రంగు పక్షులు) పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అలా ఉంచ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం.

ఆ ప‌క్షుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అట‌వీశాఖ‌కు అప్ప‌గించారు. దీంతో అట‌వీ శాఖ విజ‌య‌ల‌క్ష్మి, ద‌ర్శ‌న్ తో పాటు మేనేజర్ నాగరాజు ల‌పై అక్ర‌మ పక్షుల పెంప‌క‌పై కేసు న‌మోదు చేసి విచార‌ణ‌కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విజయలక్ష్మి ఏ1, నాగరాజు ఏ2, దర్శన్ ఏ3గా ఉన్నారు. కానీ విచార‌ణ‌కు ఏ ఒక్క‌రు హాజ‌రు కాలేదు. దీంతో ఇప్పుడీ కేసు విష‌యంలో పోలీసుశాఖ‌-అట‌వీశాఖ చార్జ్ షీట్ వేసేందుకు సిద్ద‌మైంది.

ద‌ర్శ‌న్ పై హ‌త్య కేసుతో పాటు, అట‌వీశాఖ కేసు కూడా న‌మోదు కావ‌డంతో న‌టుడి ప‌రిస్థితి మ‌రింత క‌ష్టంగా మారే అవ‌కాశం క‌నిపిస్తుంది. కేసులో ఏ1గా ఉన్న విజ‌య‌ల‌క్ష్మి త‌ప్ప‌క విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందే. మ‌రి ఛార్జిషీట్ ధాఖ‌లు చేసిన త‌ర్వాత కోర్టు ఎలాంటి అదేశాలిస్తుంద‌న్న‌ది చూడాలి. మొత్తంగా ద‌ర్శ‌న్ కుటుంబం ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ప‌డింది.