Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్స్.. అలా కన్ఫ్యూజ్ చేసిన దేవరకొండ బ్రదర్స్

ట్రైలర్ లో ఆనంద్ నటన, వాయిస్ విజయ్ లాగా ఉందంటూ వచ్చిన కామెంట్స్ కు ఆనంద్ స్పందించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   22 May 2024 12:24 PM GMT
గర్ల్ ఫ్రెండ్స్.. అలా కన్ఫ్యూజ్ చేసిన దేవరకొండ బ్రదర్స్
X

అనేక మంది అభిమానులు విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేస్తుండటం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో రౌడి స్టార్ కు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ విషయంలో తమ్ముడు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాడు. అయితే, విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తన కొత్త చిత్రం "గం గం గణేశా" ట్రైలర్ విడుదల తరువాత ఇదే అంశం పై మీడియా ముందు కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

ట్రైలర్ లో ఆనంద్ నటన, వాయిస్ విజయ్ లాగా ఉందంటూ వచ్చిన కామెంట్స్ కు ఆనంద్ స్పందించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంలో లైవ్ లోనే ఆనంద్ తన అన్న విజయ్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అందుకు విజయ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. చిన్నతనంలోనే వారి తల్లి ద్వారా ఇద్దరి వాయిస్ ఒకేలా ఉందని తెలుసుకున్నారట. ఈ ప్రత్యేకతను వినియోగించి, ఇద్దరు తమ స్నేహితులతో, గర్ల్ ఫ్రెండ్స్ తో రకరకాల సరదా చేష్టలు చేసేవారట.

కావాలని ఫోన్ చేసి ఒకరి ఫ్రెండ్స్ తో మరొకరం మాట్లాడి ప్రాంక్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు విజయ్. అలాగే తాను ఉండే అన్ని రిలేషన్షిప్స్ లో ఆనంద్ తన వాయిస్ తో మాట్లాడే అవకాశం ఉపయోగించేవారని పేర్కొన్నారు. తానూ కొన్నిసార్లు డబ్బింగ్ కూడా ఆనంద్ ను చేయమని చెప్పిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు.

"గం గం గణేశా" ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని విజయ్ తన అభిప్రాయం తెలియజేశారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. "బేబి" సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా, తప్పకుండా అందరిని ఆకట్టుకుంతుందని అన్నారు. అలాగే సినిమాకు వర్క్ చేసిన అందరికి తన బెస్ట్ విషెస్ అందించారు.

ఇక మరో విషయం గురించి మాట్లాడుతూ.. అభిమానులు ఎక్కువగా పోలికలు చూడటం వల్ల కొన్నిసార్లు మంచి సినిమాలను సెలబ్రేట్ చేయడం మరిచిపోతున్నారని ఆనంద్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. సినిమాల నాణ్యతపై కాదు, కేవలం నటుల పోలికలపై చర్చించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక "గం గం గణేశా" ఒక విగ్రహం చోరీ చుట్టూ తిరిగే కథలా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా మే 31న విశ్వక్సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి", కాజల్ "సత్యభామ" సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలతో పోటీ పడనుంది. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ లు సాధించిన విజయ్, తన తమ్ముడు ఆనంద్ కు ఇలాంటి సపోర్ట్ చేయడం, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.