Begin typing your search above and press return to search.

కల్కి : విజయ్‌, మాళవిక స్పెషల్‌ రికార్డ్‌

ఇప్పుడు కల్కి లో కూడా వీరిద్దరు నటించిన నేపథ్యంలో సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:30 AM GMT
కల్కి : విజయ్‌, మాళవిక స్పెషల్‌ రికార్డ్‌
X

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. దేశ వ్యాప్తంగా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్‌ మీడియాలో చర్చకి తెర లేపుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్‌ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తేలిపోయింది.

నాగ్‌ అశ్విన్‌ మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం సినిమాలో మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. అదే సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాతి సినిమా మహానటిలో కూడా వీరిద్దరు నటించారు. విజయ్‌ దేవరకొండ మహానటిలో ఫుల్‌ లెంగ్త్ రోల్‌ లో నటించాడు.

ఇప్పుడు కల్కి లో కూడా వీరిద్దరు నటించిన నేపథ్యంలో సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మాళవిక నాయర్‌ పాత్ర కల్కి సినిమాలో చాలా స్పెషల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన మూడు సినిమాల్లో కూడా వీరిద్దరు చాలా స్పెషల్‌ గా నటించడం ద్వారా అరుదైన రికార్డ్‌ ను వీరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయితే నాగ్‌ అశ్విన్‌ మళ్లీ మళ్లీ వీరిద్దరిని తన సినిమాలో కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.

మాళవిక నాయర్‌ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఎక్కువగా కనిపించడం లేదు. అయినా కూడా ఆమె ప్రతిభ పై నమ్మకంతో నాగ్‌ అశ్విన్‌ కీలకమైన గెస్ట్‌ పాత్రకు ఆమెను ఎంపిక చేశాడని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.