ఆ హీరోతో రిటైర్మెంట్ కి ముందు సాధ్యమేనా?
అలాగే విజయ్ తో కలిసి సినిమా చేయాలని ఉందని బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూడా జవాన్ ప్రచారంలో భాగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2024 3:30 PM GMTతలపతి విజయ్ 2026 ఎన్నికలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు సినిమాలు చేసి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తానని ప్రకటన ఇచ్చేసాడు. ఇప్పటికే వెంకట్ ప్రభుతో కలసి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది విజయ్ 68వ చిత్రం. విజయ్ 69వ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. దర్శకుడు ఎవరు? అన్నది కన్పమ్ కాలేదు. కానీ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
కార్తీక్ సుబ్బరాజ్...నెల్సన్ దిలీప్ కుమార్...లోకేష్ కనగరాజ్ ఇలా ఫేమస్ దర్శకులంతా విజయ్ కోసం క్యూలో ఉన్నారు. అందులో ఎవరో ఒకర్ని విజయ్ ఫైనల్ చేయాల్సి ఉంది. అలాగే 70వ చిత్రం కూడా ఉంటుందని ప్రచారం సాగుతుంది. అది సాధ్యమైతే మరో దర్శకుడికి ఛాన్స్ ఉంటుంది.
అలాగే విజయ్ తో కలిసి సినిమా చేయాలని ఉందని బాలీవుడ్ బాద్ హీరో షారుక్ ఖాన్ కూడా జవాన్ ప్రచారంలో భాగంగా ప్రకటించిన సంగతి తెలిసిదే. అందుకు విజయ్ కూడా మీరు యస్ అంటే? నేను ఆగుతానా? అంటూ తన సంకేతాన్ని పంపేసాడు.
మరి విజయ్ రిటైర్మెంట్ కి ముందు ఇది సాధ్యమవుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అది జరగాలంటే? అందుకు సాలిడ్ దర్శకుడు కుదరాలి. ఇద్దరి ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియాలో భారీ మల్టీస్టారర్ కంటెంట్ అయి ఉండాలి. కానీ చేతిలో ఉన్నది కేవలం రెండేళ్లు సమయం మాత్రమే. ఈలోపే కథ సిద్దమవ్వాలి...దాన్ని తెరకెక్కించాలి. అందుకు అనుగుణంగా షారుక్ డేట్లు కేటాయించాలి. ఇలా ఇంత పెద్ద తతంగా ఉంది.
ఒకవేళ అలా కుదరని పక్షంలో విజయ్ ప్రత్యక్షంగా పూర్తిగా రాజకీయాలకే బాండ్ అయితే అది జరగడం కష్టమే. రాజకీయం అనేది ఓ ఊబి. అందులో దిగిన తర్వాత బయటకు రావడం అన్నది అంత ఈజీ కాదు. పైగా విజయ్ లాంటి స్టార్ వెళ్లి మళ్లీ వెనక్కి రావడం అంటే? కోట్లాది మంది అభిమానుల ఎమోషన్ తో ముడిపడి ఉంటుంది. 2026 నుంచి తమిళనాడులో కొత్త రాజకీయం శకం మొదలవుతుంది. విజయ్ కి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్నీ దాటుకుని విజయ్ కంబ్యాక్ అన్నది అంత వీజీ కాదు. కాబట్టి షారుక్ తో సినిమా అన్నది అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు.