విజయ్ ఆంటోనీ తండ్రిది కూడా అలాంటి మరణమే!
మీరా భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. తమిళనాడులోని ఆళ్లూరుపేటలో ఉన్న విజయ్ ఆంటోనీ నివాసానికి తరలించారు
By: Tupaki Desk | 19 Sep 2023 10:28 AM GMTప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక మీడియా ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె తన రూంలో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మీరా భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. తమిళనాడులోని ఆళ్లూరుపేటలో ఉన్న విజయ్ ఆంటోనీ నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ జనాలు, బంధువులూ, స్నేహితులూ.. విజయ్ ఆంటోనీ నివాసానికి చేరుకుని సంతాపం తెలుపుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఆత్మహత్యల విషయంలో విజయ్ ఆంటోనీకి ఇది రెండో షాక్! విజయ్ ఆంటోనీ కుటుంబంలో ఇంతకు ముందు కూడా ఒక ఆత్మహత్య మరణం చోటుచేసుకుంది. విజయ్ ఆంటోనీ తండ్రి కూడా నాడు ఆత్మహత్య చేసుకునే మరణించారు. అప్పుడు విజయ్ ఆంటోనీ వయసు కేవలం ఏడు సంవత్సరాలు! ఈ విషయాన్ని ఇటీవల విజయ ఆంటోనీ స్వయంగా వెల్లడించారు.
అవును... కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టేడు దుఃఖంలో ఉన్న విజయ్ ఆంటోనీ కి ఇలాంటి షాక్ చిన్నప్పుడే తగిలింది. ఆయన తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పుడు విజయ్ వయసు 7 సంవత్సరాలే కావడంతో తన తల్లి ఎంతో కష్టపడి పెంచిందట. ఈ విషయాలపై "బిచ్చగాడు 2" ప్రెస్ మీట్ సమయంలో విజయ్ స్పందించారు.
ఇందులో భాగంగా... "జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రాణాలు మాత్రం తీసుకోకండి. ఎంత కష్టమొచ్చినా ఎదురెళ్లి పోరాడాలే కానీ ఇలా అర్థాంతరంగా మీకు మీరే ప్రాణాలు తీసేసుకుంటే ఎలా? నా తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. నా ఐదేళ్ల చెల్లిని, నన్ను మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది" అని విజయ్ తెలిపారు.