ఆ సీన్ తో నాకేం సంబంధం లేదు!
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు విజయ్ ఆంటోనీ స్పందించాడు. 'ఈ వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు.
By: Tupaki Desk | 5 Aug 2024 11:51 AM GMTతమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ తెరకెక్కించిన 'మళై పిడిక్కత మనితన్'( తెలుగులో 'తుఫాన్') టైటిల్ తో తెలుగులో ఆగస్టు 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఓ సన్నివేశం విషయంలో సినిమా చర్చనీయాంశంగా మారింది. పద్దతి ప్రకారం ఎలాంటి సెన్సార్ కట్ లేకుండానే సినిమా సెన్సార్ అయింది. అయితే రిలీజ్ తర్వాత సినిమాలో లేని ఓ సన్నివేశం యాడ్ అయి థియేటర్ లో కనిపించింది.
దీంతో ముందు థియేటర్లో ఆడియన్స్ ఆ తర్వాత విషయం తెలిసి యూనిట్ షాక్ అయింది. తాము తీయని సన్నివేశం సినిమాలోకి ఎలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు విజయ్ ఆంటోనీ స్పందించాడు. 'ఈ వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. ఆ సన్నివేశం నేను చేయలేదు. విజయ్ తెరకెక్కించిన చిత్రం మళై పిడిక్కత మనితన్(తుపాన్). తమ అనుమతి లేకుండా రెండు నిమిషాల సన్నివేశం జోడించారని తెలిసి బాదపడ్డా.
దాంతో నాకెంలాంటి సంబంధం లేదు. అలాగే ఇది 'సలీమ్ -2' అనుకుంటున్నారు. కానీ కాదు' అని అన్నారు. అలాగే దర్శకుడు విజయ్ మిల్టన్ కూడా స్పందిచాడు. ' క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సినిమా పట్ల ఉన్న అభిరుచితో ఇంత దూరం ప్రయాణం చేసాం. నిర్మాతకి-అతనికి మధ్య ఉన్న సమస్యలు సద్దుమణిగాయి. సినిమా ఆరంభంలోనే గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేసిన సన్నివేశాన్ని తొలగిస్తున్నాం. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.
ఆ సీన్ మేము సెన్సార్ చేసిన సమయంలోనే లేదు. సెన్సార్ అయిన తర్వాతే ఎవరో కావాలని యాడ్ చేసి ఉంటారు. సినిమా ఆరంభంలోనే ఆ కీలక సన్నివేశం ప్రదర్శించడం చూసి షాక్ అయ్యాను. ముందే ఆ సన్నివేశం చూపించడం వల్ల ఇదొక సాధారణ సినిమాగా మారింది. ఆ తప్పు ఎవరు చేసారో కచ్చితంగా కనిపెడంతా' అని అన్నారు.