Begin typing your search above and press return to search.

విజయశాంతి ఈజ్ బ్యాక్.. లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ ఇలా..

విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె రోల్ ను వైజయంతీ IPS గా పరిచయం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:55 AM GMT
విజయశాంతి ఈజ్ బ్యాక్..  లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ ఇలా..
X

సీనియర్ నటి విజయశాంతికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో వరుసగా కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తన యాక్టింగ్ తో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ ట్యాగ్స్ దక్కించుకుంది. సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఈలలే. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఆమె.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలా సినిమాలకు చాలా ఏళ్లపాటు దూరంగా ఉండి.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు స్మాల్ గ్యాప్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా ఆ మూవీ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఆమె ఫస్ట్ లుక్ తోపాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

NKR21 సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె రోల్ ను వైజయంతీ IPS గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాలో ఆమె రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక గ్లింప్స్ లో.. విజయశాంతి పోలీస్ గెటప్ లో అదరగొట్టింది. ఈ గ్లింప్స్ చూసి లేడీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అని నెటిజన్లు అంటున్నారు.

“వైజయంతీ ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాంకే ప్రమోషన్ వస్తుంది... తానే ఒక యుద్ధం... మేమే తన సైన్యం...” అంటూ కళ్యాణ్ రామ్ వాయిస్‌ ఓవర్ లో వస్తున్న డైలాగ్ అదిరిపోయింది. కళ్యాణ్ రామ్ కూడా గ్లింప్స్ లో వైలెంట్ గా కనిపించారు. మొత్తానికి లేటెస్ట్ అప్డేట్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.