Begin typing your search above and press return to search.

సినిమా విషయంలో లేడీ సూపర్ స్టార్ కమిట్మెంట్..!

ముఖ్యంగా ఆమె ఖాకీ చొక్కా వేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అన్నట్టే లెక్క. విజయశాంతి అంటే అలాంటి సినిమాలకే కేరాఫ్ అడ్రస్ గా మారింది.

By:  Tupaki Desk   |   17 March 2025 6:00 PM IST
సినిమా విషయంలో లేడీ సూపర్ స్టార్ కమిట్మెంట్..!
X

సిల్వర్ స్క్రీన్ మీద లేడీ సూపర్ స్టార్ అంటే అది విజయశాంతి అనే చెప్పొచ్చు. కెరీర్ లో ఆమె స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు ఎలా చేశారో ఒక స్టార్డం వచ్చిన తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో కూడా అదే రేంజ్ లో నటించారు. ముఖ్యంగా ఆమె ఖాకీ చొక్కా వేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అన్నట్టే లెక్క. విజయశాంతి అంటే అలాంటి సినిమాలకే కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఇదిలా ఉంటే మొన్నటిదాకా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న విజయశాంతిని సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు కోసం తీసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ సినిమా ఆమె ఒప్పుకోవడమే పెద్ద సవాల్ అన్నట్టుగా చేశాడు. ఐతే ఆ సినిమాలో విజయశాంతి రోల్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఐతే ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తాయని అనుకోగా అది జరగలేదు. బహుశా విజయశాంతి వద్దన్నారో ఏమో తెలియదు.

ఇక లేటెస్ట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తో మరోసారి విజయశాంతి వస్తున్నారు. సినిమాలో మరోసారి ఆమె పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఐతే ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సినిమా పట్ల ఆమెకు ఉన్న కమిట్మెంట్ ఏంటన్నది తెలిసేలా చేశారు. సినిమాకు సైన్ చేసినప్పటి నుంచి విజయశాంతి నాన్ వెజ్ తినలేదట. సినిమా రిలీజై సక్సెస్ అందుకున్న తర్వాత తిరుపతి వెనక్క దర్శనం చేసుకున్నాక నాన్ వెజ్ తింటానని అన్నారు.

ఐతే ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కలుగచేసుకుని తిరుపతి వెళ్లొచ్చాక తనే స్వయంగా చేపల పులుసు అరెంజ్ చేస్తానని అన్నారు. ఈ సినిమాలో విజయశాంతి కళ్యాణ్ రామ్ మదర్ రోల్ చేయగా టీజర్ రిలీజ్ టైంలో కూడా విజయశాంతిని కళ్యాణ్ రామ్ ఎంతో ఆప్యాయంగా అమ్మ అమ్మ అని సంబోధించడం ఫ్యాన్స్ ని అలరించింది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ఐతే విజయశాంతికి ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ మరిన్ని వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.