టైటిల్ పోస్టర్: విజయశాంతి - కళ్యాణ్ రామ్.. హై వోల్టేజ్ వైబ్!
ప్రముఖ నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 6:01 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి మాస్ ఎమోషనల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వేరియేషన్లు ట్రై చేసిన కళ్యాణ్ రామ్, ఈసారి మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఎన్నో ఊహాగానాలు నడిచాయి. దేవ, రుద్ర టైటిల్ అంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా, ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సినిమా కంటెంట్ కు పర్ఫెక్ట్ గా సెట్టయ్యేలా "అర్జున్ S/O వైజయంతి" టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమా కథ నేపథ్యం పూర్తిగా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.
విజయశాంతి కీలక పాత్రలో నటించడం ప్రధాన హైలైట్ కానుంది. ఎన్నో యాక్షన్ రోల్స్ చేసిన విజయశాంతి, మరోసారి పవర్‌ఫుల్ IPS ఆఫీసర్ పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన యాక్షన్ ఫిల్డ్ రోల్స్ చేసిన ఆమె, కళ్యాణ్ రామ్‌తో కలిసి ఆడియన్స్‌ను ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందో చూడాలి.
మూవీ టైటిల్ రివీల్ పోస్టర్ మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువ హైప్ తీసుకొచ్చింది. పోస్టర్‌లో కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరూ ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో అగ్రెసివ్ మోడ్‌లో నడుస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా వీరి మధ్య పెద్ద హ్యాండ్‌కఫ్ కనిపించడం స్టోరీలో ఇంటెన్స్‌ను రివీల్ చేస్తోంది. సినిమా కథలో వీరి తల్లి కొడుకులు అని అర్ధమవుతుంది. ఇక ఇద్దరు ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారా? లేక విభిన్నంగా ఉంటుందా? అన్న సస్పెన్స్ ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ క్రియేట్ చేశారు.
టైటిల్‌లో లెటర్స్ చెయిన్ ద్వారా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయడం సినిమా స్టోరీలో లింక్ ఉన్నట్లు సూచిస్తోంది. ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, తమ్మిరాజు ఎడిటింగ్ వంటి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను టాలీవుడ్ మార్కెట్‌కు తగ్గట్టుగా గ్రాండ్ స్కేల్‌లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం మిగిలిన భాగాల చిత్రీకరణ జరుపుకుంటూ, త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు. కళ్యాణ్ రామ్ వరుసగా డిఫరెంట్ స్టోరీల్ని ఎంచుకుంటూ తన కెరీర్ స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడు. మరి ఈసారి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.