Begin typing your search above and press return to search.

4 నెలల గ్యాప్.. 10 కిలోలు తగ్గాను: విజయశాంతి

అయితే పెళ్లి, రాజకీయాలు, కుటుంబ బాధ్యతలు.. వీటన్నింటి వల్ల మెల్లగా సినిమాలకు దూరమయ్యారు విజయశాంతి.

By:  Tupaki Desk   |   6 April 2025 9:30 PM
Vijayashanti Loses 10 Kilos for Her Comeback Role
X

టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఎన్నో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె మూవీలో యాక్ట్ చేస్తున్నారంటే.. ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యేది. అందుకు తగ్గట్లే విజయశాంతి కూడా ఏ రోల్ అయినా అదరగొట్టేవారు.

అయితే పెళ్లి, రాజకీయాలు, కుటుంబ బాధ్యతలు.. వీటన్నింటి వల్ల మెల్లగా సినిమాలకు దూరమయ్యారు విజయశాంతి. దీంతో ఆమెను మూవీ లవర్స్ బాగా మిస్ అయ్యారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అర్జున్ S/o వైజయంతి మూవీతో సందడి చేయనున్నారు. ఆ సినిమాలో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ.. ఏప్రిల్ 18వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఆ విషయాన్ని పవర్ ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా విజయశాంతి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అర్జున్ S/o వైజయంతి మూవీ కోసం 10 కిలోల బరువు తగ్గానని చెప్పి ఒక్కసారిగా షాకిచ్చారు లేడీ సూపర్ స్టార్. దీంతో డెడికేషన్ అంటే ఇది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను తొలుత.. ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు విజయశాంతి. అందుకు నాలుగు నెలల పాటు గ్యాప్ తీసుకున్నానని వెల్లడించారు.

"ఆఫర్ ను యాక్సెప్ట్ చేయకుండా నాలుగు నెలల గ్యాప్ తీసుకున్నా. ఈ లోపు 8 కిలోల వెయిట్ తగ్గాను. షూటింగ్ స్టార్ట్ అయ్యాక మరో 2 కేజీలు తగ్గాను. అందుకోసం డైట్ ఫాలో అయ్యాను. నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేశాను. రోజు జిమ్ కు వెళ్లి స్పెషల్ వర్కౌట్స్ చేశాను. ఫుడ్ విషయంలో పక్కా రూల్స్ ఫాలో అయ్యా" అని తెలిపారు.

"నేను అర్జున్ S/o వైజయంతిలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నా. అయితే తాను ఆ రోల్ చేస్తున్నానంటే అందరికీ నా కర్తవ్యం సహ పలు మూవీలు కచ్చితంగా గుర్తొస్తాయి. అప్పటికీ ఇప్పటికీ నా లుక్ లో చాలా ఛేంజ్ ఉంటుంది. కానీ కొందరు కంపేర్ చేస్తారు. అందుకే కాస్త కష్టం అనిపించినా బరువు తగ్గాను" అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..