Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ మనస్పర్థలు… క్లారిటీ ఇదే

ఈ సినిమాల ద్వారా దర్శకుడిగా విజయ్ భాస్కర్ కి ఎంత గుర్తింపు వచ్చిందో డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే పేరు వచ్చింది.

By:  Tupaki Desk   |   21 July 2024 2:45 AM GMT
త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ మనస్పర్థలు… క్లారిటీ ఇదే
X

టాలీవుడ్ లో కె విజయ్ భాస్కర్ అంటే స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ సినిమాలు విజయ్ భాస్కర్ ని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. విజయ్ భాస్కర్ స్వయంవరం సినిమా నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అండ్ స్టోరీ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాల ద్వారా దర్శకుడిగా విజయ్ భాస్కర్ కి ఎంత గుర్తింపు వచ్చిందో డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే పేరు వచ్చింది.

మాటల మాంత్రికుడు అనే బ్రాండ్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. నువ్వే నువ్వే సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడిగా మారాడు. తరువాత అతను వరుస సక్సెస్ లు అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లలో ఒకరుగా ఉన్నారు. విజయ్ భాస్కర్ మాత్రం మల్లీశ్వరి తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ లు మళ్ళీ అందుకోలేదు. దాంతో అతను సినిమాలు కూడా క్రమంగా తగ్గించేశారు. ఆయన చేసిన జిలేబి మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

ఉషా పరిణయం అనే సినిమాని ప్రస్తుతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. మా మధ్య మనస్పర్థలు అనేవి అస్సలు లేవు. ఏ విషయాన్ని అయిన మేము లైట్ గా తీసుకుంటాము. అంత దూరం కూడా మేము ఆలోచించే టైపు కాదు. ఎంత పెద్ద సమస్య అయిన ఈజీగా తీసుకుంటాం.

అయితే జై చిరంజీవి తర్వాత అతను తన సినిమాలలో బిజీ అయ్యారు. అందుకే కలిసే అవకాశం రాలేదు. మొన్న కూడా ఆయన ఓ నెంబర్ నుంచి ఫోన్ చేశారు. షూటింగ్ లో ఉన్నానని చెబితే వెంటనే గంటలో లొకేషన్ కి వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. త్రివిక్రమ్, నేను లొకేషన్ కి వచ్చి స్క్రిప్ట్ పై వర్క్ చేయము… కాలక్షేపంగా మాట్లాడుకుంటాం. రీసెంట్ గా వచ్చినపుడు కూడా కొద్దిసేపు మాట్లాడుకున్నాం. తరువాత ఆయన మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్లిపోయారు.

మా మధ్య ఇప్పటికి మంచి బాండింగ్ ఉంది. కేవలం త్రివిక్రమ్ సినిమాలతో బిజీగా ఉండటం వలనే రెగ్యులర్ గా కలవడం కుదరడం లేదు తప్ప ఎలాంటి డిస్టబెన్స్ లేవు. అదంతా కేవలం ప్రచారం మాత్రమ అని డైరెక్టర్ విజయ్ భాస్కర్ తేల్చేశారు.