Begin typing your search above and press return to search.

విజయ్-అభిషేక్ కాంట్రవర్సీ.. అసలు రీజన్ ఇదే

ది విజయ్ దేవరకొండపై నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా పోస్ట్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతోంది

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:58 AM GMT
విజయ్-అభిషేక్ కాంట్రవర్సీ.. అసలు రీజన్ ఇదే
X

ది విజయ్ దేవరకొండపై నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా పోస్ట్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతోంది. కానీ విజయ్ మాత్రం ఏం స్పందించకుండా మెచ్యురిటీగా ఉండి ఖుషి సక్సెస్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులే ఆయనకు అండగా నిలుస్తూ.. అభిషేక్ నామాపై విరుచుకుపడుతున్నారు. నామా చేసిన పని సరైందని కాదని అభిప్రాయపడుతున్నారు

అయితే అసలు ఈ గొడవకు వెనక ఉన్న కారణం ఏంటనేది వివరాళ్లోకి వెళితే.. వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో తనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో రూ. కోటి రూపాయలను.. అభిమానుల్లోని 100 మంది పేద కుటుంబాలకు లక్ష చొప్పున ఇస్తున్నా అని చెప్పి అభిమానుల మనసు దోచుకున్నాడు. దీంతో అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు.

అయితే దీనిపై నిర్మాత అభిషేక్ నామా మాత్రం భిన్నంగా స్పందించారు. సమయం కోసం కాచుకుని ఉన్నారో ఏమో మరి కానీ.. అభిమానులకు డబ్బులివ్వడం సంతోషం. కానీ మీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రబ్యూట్ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. మా డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకోండి అంటూ ఒక ట్వీట్ చేసి అభిమానుల కోపానికి గురయ్యారు.

అయితే నామా నష్టపోయింది నిజమే. కానీ సాధారణంగా ఓ హీరో సినిమా వల్ల నష్టం వస్తే.. ఆ హీరో.. నష్టాన్ని పూడ్చేందుకు వారికి మరో సినిమా చేసి పెడుతుంటారు. అందరూ ఇలా చేయాలని లేదు. నామా కూడా మీ రెమ్యూనరేషన్ ఎంత ఉంటే అంత తీసుకుని ఓ సినిమా చేసి పెట్టండి అని ప్రపోజల్ పెట్టారట. కానీ దీనిపై విజయ్ సానుకూలంగా స్పందించలేదట. అందుకే అప్పటి నుంచి విజయ్ సమాధానాన్ని మనసులో పెట్టుకున్న నామా ఇప్పుడు సమయం చూసుకుని ఇలా వాదనకు దిగారని తెలిసింది.

అభిమానులైతే.. సినిమా నష్టం వస్తే నిర్మాతని అడగాలి గానీ హీరోని అడగడం ఏంటి అనే నామాను ప్రశ్నిస్తున్నారు. కానీ నిజానికి వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాత కేఎస్ రామారావు కూడా నష్టపోయారు. దీనిపై నామా కూడా ప్రతి స్పందన ఇచ్చారు. నిర్మాతను అడగాలి నిజమే కానీ.. ఓ సినిమా రైట్స్ కొనేది హీరోని చూసి, ఆయన్ని నమ్మే కదా? పైగా నేనేమి నష్టాన్ని భర్తీ చెయ్యమని చెప్పలేదు. డేట్స్ ఇవ్వండి. మార్కెట్ బట్టే మీ రెమ్యునరేషన్ తీసుకోండి అని అంటున్నాను. ఇందులో అభ్యంతరం ఏముంది? అని అంటున్నారు నామా. మొత్తంగా ఇప్పటికే భారీ డిజాస్టర్ అయిన నష్టాల్ని తెచ్చుకున్న లైగర్ సమస్యే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ వివాదం కూడా తెరమీదకు వచ్చి చర్చనీయాంశమైంది. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో..