సమంత గురించి విజయ్ ని ఆరా తీసిన నాగార్జున..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె జీవితంలోని చాలా విషయాలు ప్రేక్షకులకు తెలుసు.
By: Tupaki Desk | 4 Sep 2023 6:54 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె జీవితంలోని చాలా విషయాలు ప్రేక్షకులకు తెలుసు. సమంత , యంగ్ హీరో నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల పాటు సంతోషంగా ఉన్న ఈ జంట, కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయింది. ఈ జంట విడిపోవడంతో, ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అంతేకాదు, వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అని కోరుకున్నవారు కూడా ఉన్నారు.
అయితే, ఈ విషయంలో సమంతను, నాగ చైతన్యను విపరీతంగా ట్రోల్ చేసినవారు ఉన్నారు. వీరి కోసం ఫ్యాన్స్ గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, అభిమానులు ఎంత గొడవ పడినా, వాళ్లు, వాళ్లు మాత్రం ఈ విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకుండా, బాగానే ఉంటున్నారు. ఈ విషయం తాజాగా నాగార్జున మాటల్లో తెలిసింది.
ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఏడో సీజన్ ఆదివారం ప్రారంభమైంది. అయితే, ఈ షోకి విజయ్ దేవర కొండ వచ్చారు. ఆయన తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడికి వచ్చి సందడి చేశారు. అయితే, విజయ్ కనపడగానే నాగార్జన వెంటనే సమంత గురించి అడగడం విశేషం. నిజానికి సమంత ఊసు ఎత్తకుండా మూవీ గురించి విజయ్ తో నాగ్ మాట్లాడొచ్చు. కానీ, ఆయన గతంలో జరిగిన ఆ విషయాలను మనసులో పెట్టుకోకుండా, మనస్ఫూర్తిగా సమంత గురించి అడిగారు.
అంతేకాకుండా, సమంత ఫెంటాస్టిక్ నటి అని మెచ్చుకోవడం విశేషం. అయితే, సమంత చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిందని, అక్కడ కూడా ప్రమోషన్స్ చేసిందని చెప్పాడు. చికిత్స తర్వాత సమయంత ఇండియా వస్తుందని చెప్పాడు. ఇక, తన మూవీకి చాలా కాలం తర్వాత మంచి రివ్యూలు వచ్చాయని, మూవీ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారని, అందుకే తాను కూడా ఖుషీగా ఉన్నట్లు విజయ్ చెప్పాడు.
అయితే, ఎక్కువగా, నాగ్ సమంత గురించి అడగడమే ఇప్పుడు వైరల్ అవుతుంది. తన మాజీ కోడలు, తన కొడుకుతో విడిపోయిన తర్వాత కూడా సమంత గురించి నాగ్ అంత పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం అందరికీ నచ్చుతుంది. అదీ నాగ్ అంటే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.