Begin typing your search above and press return to search.

ఖుషి.. కావాలని టార్గెట్ చేశారా?

ఓ వైపు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు, మరో వైపు గట్టి పోటీనిస్తున్న వారసులు.. వీరి మధ్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఓ స్టార్​గా ఎదగడమంటే మామూలు విషయం కాదు.

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:58 PM GMT
ఖుషి.. కావాలని టార్గెట్ చేశారా?
X

ఓ వైపు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు, మరో వైపు గట్టి పోటీనిస్తున్న వారసులు.. వీరి మధ్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఓ స్టార్​గా ఎదగడమంటే మామూలు విషయం కాదు. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటోళ్లు. అలాంటి వారిలో విజయ్​ దేవరకొండ ఒకరు. అయితే ఈయనపై చాలాసార్లు నెగటివ్​ ప్రచారం సాగుతూనే ఉంటుంది. ఖుషి సినిమాతో రీసెంట్​గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన విషయంలో తాజాగా మరోసారి ఇలాంటే ప్రచారమే మొదలైంది.

వివరాళ్లోకి వెళితే.. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుటూ చెప్పులు అరిగేలా తిరిగి.. ఎన్నో ఆడిషెన్స్​కు వెళ్లి.. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఫైనల్​గా ఓ సినిమాలో హీరోగా ఛాన్స్​ అందుని.. ఆ తర్వాత స్టార్​గా ఎదిగారు విజయ్​ దేవరకొండ. కెరీర్​లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా రేంజ్​లో స్టార్​డమ్​ను అందుకున్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో సైడ్ హీరోగా నటించిన ఆయన.. ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోగా మారి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ హిట్​ సినిమాలో నటించి స్టార్​డమ్​ను అందుకున్నారు. ఈ విజయంతో దేవరకొండ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ వెంటనే 'గీతా గోవిందం'తో టాలీవుడ్ మోస్ట్ డిమాండింగ్ స్టార్‌గా మారిపోయారు. వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్​లో దూసుకెళ్లారు.

అయితే ఎంత క్రేజ్​ సంపాదించుకున్నప్పటికీ అదే స్థాయిలో కాంట్రవర్సీ హీరోగా కూడా మారారు. తన యాటిట్యూడ్, ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడటంతో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో సార్లు నెగటివిటీకి కూడా గురయ్యారు. రీసెంట్​గా లైగర్ సమయంలోనూ ఆయన చూపించిన యాటిట్యూడ్, ఓవర్​ కాన్ఫీడెన్స్​ మస్త్ ట్రోలింగ్ అయింది.

కానీ ఇప్పుడు విజయ్​లో చాలా మార్పు వచ్చింది. మాట్లాడే విధానం, వ్యవహరించే తీరులో మెచ్యూరిటీ వచ్చింది. కాంట్రవర్సీకి దూరంగా ఉండాలనుకున్నారో మరి ఏమో కానీ చాలా మారిపోయారు. కానీ విజయ్​పై మాత్రం మళ్లీ నెగటివిటీ మొదలైంది. తాజాగా ఆయన ఖుషి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు బుక్​మై షోలో దాదాపు 10kకు పైగా ఫేక్ అకౌంట్స్​ నుంచి 1/10 రేటింగ్స్​ ఇచ్చారు. ఈ రేటింగ్స్​ పబ్లిక్​ అకౌంట్స్​ నుంచి వచ్చి ఉంటే ఓకే.. కానీ ఇవన్నీ అన్​ఐడెంటిఫైడ్​ యూజర్స్ నుంచి వచ్చినవ్వే. కాబట్టి దీని బట్టి ఎవరో కావాలనే ఈ నెగెటివ్ కాంపైన్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి ఎవరు, ఎందుకు ఇంత నెగటివిటీ వ్యాప్తి చేయాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే మంచిది.