విజయ్ కి అలాంటి అమ్మాయి కావాలి! సమంత
ఫ్యామిలీ లైఫ్ నాకొద్దు అన్న స్టార్ పెళ్లి చేసుకున్న తన స్నేహితుల జీవితాన్ని చూసి తాను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు
By: Tupaki Desk | 17 Aug 2023 5:56 AM GMTవిజయ్ దేవరకొండ మనసు పెళ్లిపై మళ్లిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు పెళ్లి చేసుకోను..ఫ్యామిలీ లైఫ్ నాకొద్దు అన్న స్టార్ పెళ్లి చేసుకున్న తన స్నేహితుల జీవితాన్ని చూసి తాను కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని విజయ్ ఓపెన్ గానే చెప్పాడు. రెండుమూడేళ్ల తర్వాత మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెడతానని తెలిపాడు.
ఇదే సమయంలో సమంతతో కలిసి ఖుషీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత-విజయ్ భార్య భర్తల పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ ఇలాంటి పాత్రలో విజయ్ నటించలేదు. ఆ రకంగా ఖుషీ సినిమా కూడా విజయ్ వ్యక్తిగత జీవితంలో కొంత మార్పు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈనేపథ్యంలో ఖుషీ ప్రచారంలో భాగంగా సమంత--విజయ్ కి ఎలాంటి అమ్మాయి కావాలో రివీల్ చేసింది. విజయ్ ని వివాహం చేసుకునే అమ్మాయికి ఈ లక్షణాలు తప్పని సరి అంటూ చెప్పుకొచ్చింది.
'ఆమె చాలా సింపుల్‌గా ఉండాలి. అతడి కుటుంబంతో సులువుగా కలిసిపోవాలి. తల్లిదండ్రు లు ..కుటుంబం అన్నా విజయ్ కి ఎంతో ఇష్టం. గౌరవంతో ఉంటాడు. అతని అలోచనలు చాలా సాధారణంగా ఉంటాయి. అలా విజయ్ కి మ్యాచ్ అమ్మాయి దొరికితే బాగుంటుందని' తెలిపింది. సమంత మాటల్ని బట్టి 'గీతగోవిందం'లో విజయ్ గోవింద్ కోరుకున్న అమ్మాయి లాంటిందే కావాలని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.
అలాగే మరిన్ని విశేషాలు చెబుతూ..' విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేసాడు. గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడు. అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ ' అంది. సమంత గురించి కూడా విజయ్ పలు విషయాలు చెప్పాడు. 'రాహుల్ రవీంద్రన్.. చిన్మయి.. నీరజ కోన.. మేఘన.. సమంత బెస్ట్ ఫ్రెండ్స్. సమంతకు కోపం కట్టలు తెంచుకున్నా అసభ్యంగా మాట్లాడదు. చాలా పద్దతి సహనంగా ఉంటుంది' అని అన్నాడు.