నేను మానసికంగా సిద్ధం కాలేదు
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వచ్చే వారు 'ఖుషి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే
By: Tupaki Desk | 24 Aug 2023 1:30 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వచ్చే వారు 'ఖుషి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. గత చిత్రాల ఫలితం నేపథ్యం లో ఈ సినిమా పై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అగ్రెసివ్ గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు. గత కొన్నాళ్లుగా రష్మిక మందన్నా తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాలో పెళ్లి వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యం లో రౌడీ స్టార్ స్పందించాడు.
ఇప్పట్లో తన పెళ్లి ఉండదని పేర్కొన్నాడు. అంతే కాకుండా తాను పెళ్లికి మానసికంగా సిద్ధం కాలేదని కూడా పేర్కొన్నాడు. అంతే కాకుండా నేను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం లేదని పేర్కొన్నాడు. అంటే రౌడీ స్టార్ ప్రేమ వివాహం చేసుకుంటాడని తేలిపోయింది. అయితే ఎప్పుడు అనేది మాత్రం స్పష్టత లేదు.
ప్రేమ వివాహం చేసుకుంటానంటూ విజయ్ దేవరకొండ ప్రకటించడంతో రష్మిక మందన్నా తో ప్రేమ వివాహం ఖాయం అంటూ కొందరు అభిప్రాయానికి వస్తున్నారు. రౌడీ స్టార్ నుండి ఇప్పటి వరకు అలాంటి క్లారిటీ అయితే లేదు. మరో వైపు రష్మిక మందన్నా కూడా ప్రే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇటీవల చెన్నై లో జరిగిన ఖుషి ప్రమోషనల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రష్మిక మందన్నా తో మళ్లీ నటించాలని వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. మంచి కథ వస్తే తనతో వెంటనే నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా కూడా పేర్కొన్నాడు.