Begin typing your search above and press return to search.

పెళ్లిపై ఓపెన్ అయిన రౌడీ..అలాంటి అమ్మాయి కావాల‌ట‌

చిన్న చిన్న విష‌యాలు కూడా ఆమె గుర్తు చేసేలా ఉండాలి. ఎందుకంటే తిన‌డం నుంచి హాలీడే వ‌ర‌కు నేను అన్ని విష‌యాలు మ‌ర్చిపోతుంటాను

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:30 AM GMT
పెళ్లిపై ఓపెన్ అయిన రౌడీ..అలాంటి అమ్మాయి కావాల‌ట‌
X

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి మ్యాట‌ర్ ఈ మ‌ధ్య బాగా వైర‌ల్ అవుతోంది. ప్ర‌తి ఇంట‌ర్వ్యూలోనూ, ప్ర‌మోష‌న్స్‌లోనూ ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా ఆయ‌న‌ పెళ్లి ప్ర‌స్థావ‌నే క‌నిపిస్తోంది. అయితే తాజాగా త‌న పెళ్లిపై రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ అయ్యాడు. పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు కాబోయే భార్య ఎలా ఉండాలి?..త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాలి అనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

'లైగ‌ర్‌' వంటి డిజాస్ట‌ర్ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఖుషీ'. క్రేజీ హీరోయిన్ స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. విజ‌య్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది. ఇటీవ‌ల నేష‌న‌ల్ లెవెల్లో అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన విజ‌య్ త‌న పెళ్లి గురించి హింట్ ఇచ్చేశాడు.

అంతే కాకుండా పెళ్లిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని చెబుతూనే తాను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో, అమెకు ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాలో చెప్పుకొచ్చాడు. 'నాకు ఇష్ట‌మైన‌ప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఎవ‌రో ప్రెజ‌ర్ పెడుతున్నార‌ని నిర్ణ‌యం తీసుకోను. ఒక వేళ కుదిరితే ఎలాంటి హ‌డావిడీ లేకుండా సింపుల్‌గా మ్యారేజ్ చేసుకుంటా. నాతో అన్నీ షేర్ చేసుకునే, నా ఇష్టాల‌ను మెచ్చే అమ్మాయే నా జీవితంలోకి రావాల‌ని కోరుకుంటున్నా.

చిన్న చిన్న విష‌యాలు కూడా ఆమె గుర్తు చేసేలా ఉండాలి. ఎందుకంటే తిన‌డం నుంచి హాలీడే వ‌ర‌కు నేను అన్ని విష‌యాలు మ‌ర్చిపోతుంటాను. అవ‌న్నీ గుర్తు చేసేలా ఉండాలి. అంతే కాకుండా కాస్త ఇంటెలిజెంట్ అయి తాను ఎంజాయ్ చేసేవి ఆమె కూడా ఎంజాయ్ చేసేలా ఉంటే బాగుంటుంది' అంటూ త‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తి ఎలా ఉండాలో రౌడీ స్టార్ కోరిక‌ల చిట్టా విప్పాడు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న చేతిలో ఓ అమ్మాయి చెయ్యేసి ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌డం తెలిసిందే. ఏవేవో జ‌రుగుతున్నాయి. ఇది మాత్రం చాలా స్పెష‌ల్ త్వ‌ర‌లో అస‌లు విష‌యం చెబుతా అంటూ దీనికి క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో విజ‌య్ పెళ్లి వార్త చెప్ప‌బోతున్నాడ‌ని అంత భావిస్తున్నారు.