స్టార్ హీరో చెబుతున్న అడ్జెస్ట్మెంట్ పాఠం..!
ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా సరే ఒకప్పటి పరిస్థితి పెరిగిన వాతావరణం మర్చిపోకూడదు.
By: Tupaki Desk | 26 March 2024 5:08 AM GMTఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా సరే ఒకప్పటి పరిస్థితి పెరిగిన వాతావరణం మర్చిపోకూడదు. ఎందుకంటే కాస్త డబ్బులు కనపడగానే లేని పోని హంగు ఆర్భాటాలకు పోవడం మానవ నైజం. కానీ అలాంటి టైం లోనే మన గతాన్ని గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా సరే జీవితంలో అడ్జెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అడ్జెస్ట్ అవుతూనే జీవితంలో ముందుకు వెళ్లగలం. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఈమధ్యనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ లైఫ్ లో అడ్జెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అంటున్నాడు.
ఇప్పుడు తానొక మంచి పొజిషన్ ఉన్నా కూడా జీవితంలో ఎన్నో పరిస్థితులకు అడ్జెస్ట్ అవుతూ వచ్చానని విజయ్ దేవరకొండ అన్నారు. స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నాన్నను సైకిల్ అడిగితే.. బర్త్ డేకి కొనిస్తానని అన్నారు. బర్త్ డే కాస్త హాలీడేస్, ఫెస్టివల్ ఇలా వాయిదా వేస్తూ వచ్చారు. సైకిల్ మాత్రమే కాదు టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్ ఇలా ప్రతి ఒక్కటి అడ్జెస్ట్ అవుతూనే వచ్చాను. చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అడ్జెస్ట్ అవుతూ వస్తుంటాం. అడ్జెస్ట్మెంట్ అనేది జీవితంలో ఒక పాఠం అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీని నిలబెట్టే స్టార్ అని.. ఫ్యామిలీ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడని చెబుతున్నారు. ఆల్రెడీ పరశురాం తో గీతా గోవిందం లాంటి హిట్ కొట్టిన సెంటిమెంట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ స్టార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించుకోగా ఫ్యామిలీ స్టార్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. సర్కారు వారి పాట తర్వాత పరశురాం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే బజ్ బాగుంది. సినిమా ఫ్యామిలీస్ ని టచ్ చేస్తే చాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నట్టే లెక్క. ఏప్రిల్ 5న సోలోగా వస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.