Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. 5 ఏళ్ళ నుంచి ట్రాక్ ఎలా ఉందంటే..

గత ఐదేళ్లలో విజయ్ ఖాతాలో వరుసగా 5 ఫ్లాప్ లు చేరాయి. అయినప్పటికీ అతని మార్కెట్ రేంజ్ అయితే తగ్గలేదు. మంచి క్రేజ్ తోనే సినిమాలకు హైప్ తీసుకోస్తున్నాడు.

By:  Tupaki Desk   |   14 April 2024 3:30 PM GMT
విజయ్ దేవరకొండ.. 5 ఏళ్ళ నుంచి ట్రాక్ ఎలా ఉందంటే..
X

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. భారీ బడ్జెట్ లతో సినిమాలు చేస్తోన్న ప్రేక్షకులని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. కథల ఎంపికలో ప్రాబ్లెమ్ వచ్చిందో, ఆడియన్స్ టేస్ట్ మారిందో కానీ కంటెంట్ తేడా కొడితే ఎంత పెద్ద హీరో సినిమా అయిన వీకెండ్ పూర్తయ్యేలోపే ఖాళీ అయిపోతుంది. బాగుందనే టాక్ వచ్చిన థియేటర్స్ కి ఆడియన్స్ వెళ్లడం లేదు.

సూపర్ గా ఉంది అనే టాక్ మాత్రమే సినిమాని రెండు వారల పాటు థియేటర్స్ లో హోల్డ్ చేస్తోంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ తరువాత టాక్సీవాలాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. టైర్ 2 హీరో రేంజ్ కి తీసుకొని వెళ్లాయి.

అయితే తరువాత అతని సినిమాలు ఆడియన్స్ ని మెప్పించడంలో అంతగా క్లిక్ కావడం లేదు. యాక్టర్ గా అతని ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. కేవలం దర్శకులు సిద్ధం చేస్తోన్న కథలు ప్రేక్షకులకి నచ్చడం లేదు. డియర్ కామ్రేడ్ సినిమా పరవాలేదు అనే టాక్ అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. దాని తర్వాత నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, వరుసగా డిజాస్టర్ అయ్యాయి.

గత ఏడాది ఖుషి సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టిన పెట్టుబడి రావడంతో బిజినెస్ పరంగా నిర్మాతలు హ్యాపీ అయ్యారు. కానీ ఆ సినిమా ఇంకా ఎక్కువ స్థాయిలో సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాపై రిలీజ్ కి ముందు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. అయితే కొన్ని విషయాల్లో మొదటిరోజే మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీశామని వారికి రీచ్ అయ్యిందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే వీకెండ్ మూడు రోజులు, పండగ సీజన్ దాటిన తర్వాత కలెక్షన్స్ పెద్దగా పెరగలేదు.

చిత్ర యూనిట్ కూడా సినిమాపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సైలెంట్ అయిపొయింది. దీనిని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో నష్టాలను కలిగిస్తుంది అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. గత ఐదేళ్లలో విజయ్ ఖాతాలో వరుసగా 5 ఫ్లాప్ లు చేరాయి. అయినప్పటికీ అతని మార్కెట్ రేంజ్ అయితే తగ్గలేదు. మంచి క్రేజ్ తోనే సినిమాలకు హైప్ తీసుకోస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో విజయ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అయిన అతని కెరియర్ ని మళ్ళీ గాడిలో పెడుతుందేమో అనేది చూడాలి.