Begin typing your search above and press return to search.

నాకు టైం లేదు.. నా దగ్గరకు రాకని చెప్పా : విజయ్ దేవరకొండ

సక్సెస్ మీట్ లో విజయ్ బేబీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఇక్కడకు రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు.

By:  Tupaki Desk   |   18 July 2023 4:41 AM GMT
నాకు టైం లేదు.. నా దగ్గరకు రాకని చెప్పా : విజయ్ దేవరకొండ
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బేబీ. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ్ముడి సినిమా సక్సెస్ మీట్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు. బేబీ ప్రీమియర్స్ చూసిన విజయ్ ఆ టైం లో ఏం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడతా అన్నారు.

సక్సెస్ మీట్ లో విజయ్ బేబీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఇక్కడకు రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఒక సినిమా అభిమానిగా హ్యాపీ.. యంగ్ టీం పొందిన సక్సెస్ చూసి హ్యాపీ అని అన్నారు. తమ్ముడి సక్సెస్ చూసి కూడా హ్యాపీ అన్నారు. బేబీ సినిమా 13న ప్రివ్యూ చూసినప్పుడు నా రెస్పాన్స్ కోసం ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ఎదురుచూస్తున్నారు. సినిమా నచ్చింది కానీ నేను ఆ టైం లో మాట్లాడలేకపోయాను. సినిమా చూసి నేను కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యానని అన్నారు విజయ్.

బేబీ సినిమాకు 3 పిల్లర్స్ ఉన్నారు. అందరు కలిసి పనిచేశారు కానీ 3 పిల్లర్స్ సినిమాను నిలబెట్టాయి. మొదటి వ్యక్తి సాయి రాజేష్.. రెండో వ్యక్తి విజయ్ బుల్గానిన్, మూడు బేబీ యాక్టర్స్ ఆనంద్, వైష్ణవి, విరాజ్ లని అన్నారు విజయ్ దేవరకొండ. సాయి రాజేష్ ఈ సినిమాతో ఒక గొప్ప ఇంప్యాక్ట్ క్రియేట్ చేశారని.. మ్యూజిక్, పోస్టర్స్, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపించాయి. మంచి స్టోరీ టెల్లర్ గ సాయి రాజేష్ సూపర్ అనిపించుకున్నాడని అన్నారు విజయ్.

చిన్నప్పుడు సినిమా చూసే టైం లో అన్నిటికీ కనెక్ట్ అయ్యేవాడిని మంచి సినిమా చెడ్డ సినిమా ఉండేది కాదు యాక్టర్ అయ్యాక అలా చూడలేకపోయా.. యాక్టర్ అయ్యాక ప్రొఫెషనల్ లెవెల్ లో చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు తానొక యాక్టర్ అని మర్చిపోయేలా చేస్తాయి. బేబీ సినిమా అలా చేసిందని అన్నారు విజయ్. సినిమా అని మర్చిపోయి నిజంగానే జరిగిందేమో.. వాళ్లు నిజమైన వ్యక్తులేమో అని నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. సినిమా చూసి మెచ్చుకున్నా.. తిట్టినా అన్నీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అని అన్నారు. సినిమా చూసాక డిబెట్ చేయాల్సింది ఏంటంటే ఏది చేయాలి ఏదిచేయకూడదు అన్నది నేర్చుకోవాలని అన్నారు విజయ్ దేవరకొండ.

నా లైఫ్ లో నాకు తెలిసిన పరిస్థితుల గురించి సినిమా ఆలోచించేలా చేసింది. ఆ విషయంలో సాయి రాజేష్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అమ్మాయిలంతా ఇలానే ఉంటారని లేదు తన లైఫ్ లో చాలా గొప్ప అమ్మాయిలను చూశాను. అయితే కొందరు అలా ఉంటారు. ఈ సినిమా అదే చెబుతుంది అన్నారు. కంగ్రాట్స్ సాయి రాజేష్ నెక్స్ట్ ఏం చేస్తావని ఎగ్జైటెడ్ గా ఉన్నానని అన్నారు విజయ్. నేను ఫోన్ దూరం లో ఉంటా ఎలాంటి సహాయం కావాలన్నా అడుగని అన్నారు.

విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యింది.

విరాజ్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. బేబీ తర్వాత అతనికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. వైష్ణవి నీ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అంతకుముందు ఆమె యూట్యూ లో చేసిందట నాకేమి ఇవి తెలియదని అన్నారు విజయ్. గీతా గోవిందం లో ఉందట కానీ తనకు గుర్తు లేదు. ఫస్ట్ సినిమాకు కంటెంట్ కి ఇలాంటి మెచ్యుర్డ్ గా చేయడం చాలా కష్టం. యాక్టింగ్ అని కాకుండా సహజంగా నటించారు. ఫ్యామిలీని సంతోషంగా ఉంచడం చాలా గొప్ప విషయం. నువ్వు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి.. మంచిగా సంపాదించాలని అన్నారు విజయ్ దేవరకొండ.

ఇక ఆనంద్ గురించి చెబుతూ.. తమ్ముడు సక్సెస్ కొట్టినందుకు హ్యాపీ.. సినిమా హిట్టా ఫ్లాపా అన్నది కాదు.. ప్రతిదీ తీసుకోవాల్సిందే. ఆనంద్ యాక్టర్ అవుతా అన్నప్పుడు తిట్టాను.. నా దగ్గరకు మాత్రం రాకు.. నాకే కష్టంగా ఉందని అన్నాను.. అలా తన స్టోరీస్ తానే సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. బేబీ కథ తెలియదు.. ఏం ఐడియా లేదు. బేబీ క్రెడిట్ మొత్తం అతనిదే.. యాక్టర్ గా చాలా మంచి గ్రోత్ అవుతున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది శాశ్వతం కాదు వాటిని ఆహ్వానించాలని అన్నారు విజయ్ దేవరకొండ.

సినిమాను ప్రేమిస్తాం కాబట్టి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాం.. ఒక్కరి లైఫ్ మారితే అందరి లైఫ్ మారుతుంది. అరవింద్ గారి వల్ల వాసు.. వాసు వల్ల మారుతి.. మరుతి వల్ల ఎస్.కె.ఎన్.. ఎస్.కె.ఎన్ వల్ల సాయి రాజేష్ ఇలా ఇంతమంది లైఫ్ మార్చేలా చేసింది సినిమా.. అందుకే చేసే పని పర్ఫెక్ట్ గా చేయండి అదే సక్సెస్ ఇస్తుందని అన్నారు విజయ్ దేవరకొండ.

టాక్సీవాలా చేస్తున్నప్పుడు ఎస్.కె.ఎన్ ఏం చేస్తాడో తెలియదు. ఆ సినిమా ప్రివ్యూ లో పక్కన కూర్చుని గట్టిగా అరుస్తున్నాడు.. చప్పట్లు కొడుతున్నాడు సినిమాని అలా ఎంజాయ్ చేస్తాడని మనిషి అర్ధమయ్యాక తెలిసింది. వీళ్లు కథ నచ్చితే యాక్టర్స్ ఎవరు అని చూడరు. వీళ్లు ఇంకా చాలా సక్సెస్ లు చూడాలని అన్నారు. ఫైనల్ గా అల్లు అరవింద్ గారికి థాంక్స్ మీ బ్యానర్ లో రెండు సక్సెస్ లు కొట్టా.. ఆనంద్ ఒకటి హిట్ కొట్టాడు దీనితో హ్యాట్రిక్ అయ్యిందని అన్నారు విజయ్ దేవరకొండ.