Begin typing your search above and press return to search.

విజయ్... మంచి మూవీ మిస్ చేసుకున్నాడుగా!

అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూపర్ హిట్ మూవీ, హారర్ థ్రిల్లర్ అవునులో నటించే ఛాన్స్ విజయ్ మిస్ చేసుకున్నారట.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:56 AM GMT
విజయ్... మంచి మూవీ మిస్ చేసుకున్నాడుగా!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న విజయ్.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తున్నారు.

స్పె యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రెండు భారీ సినిమాలను లైన్ లో పెట్టారు దేవరకొండ. రాజాగారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా, టాక్సీవాలాతో ఇప్పటికే హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో చెరో మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో షూటింగ్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.

అయితే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూపర్ హిట్ మూవీ, హారర్ థ్రిల్లర్ అవునులో నటించే ఛాన్స్ విజయ్ మిస్ చేసుకున్నారట. నటుడు, డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న రవి బాబు అవును సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి పూర్ణ భర్తగా విజయ్ దేవరకొండ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించకపోవడంతో హర్షవర్ధన్ రాణే యాక్ట్ చేశారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా.. కమర్షియల్ కూడా మంచి విజయం సాధించింది. దీంతో విజయ్ ఓ సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే అవునులో విజయ్ ఛాన్స్ మిస్ చేసుకున్న విషయాన్ని రవిబాబే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తనకు విజయ్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నువ్విలా సినిమాలో విజయ్ తన వల్ల హర్ట్ అయ్యాడని చాలా మంది రూమర్లు క్రియేట్ చేశారని తెలిపారు.

"విజయ్ దేవరకొండ నేను తీసిన నువ్విలా సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సమయంలో నా వల్ల విజయ్ హర్ట్ అయ్యాడని కొందరు అంటున్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసే పనిచేశాం. అంటే మా మధ్య ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేనట్టే కదా.. అలాంటి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని తెలిపారు. త్వరలోనే రష్ చిత్రంతో ఈటీవీ విన్ ఓటీటీలో సందడి చేయనున్న రవిబాబు.. ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.