Begin typing your search above and press return to search.

ది విజయ్ దేవరకొండ.. సంక్రాంతికి రిస్క్ చేస్తున్నాడా..?

అయితే సంక్రాంతికి విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:15 AM GMT
ది విజయ్ దేవరకొండ.. సంక్రాంతికి రిస్క్ చేస్తున్నాడా..?
X

ఖుషి తో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా మీద చాలా హోప్స్ తో ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషి సినిమా ఒక మంచి లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా ప్రచార చిత్రాలన్నీ కూడా అంచనాలు పెంచాయి. ఖుషి తో విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందం డైరెక్టర్ పరశురాం తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుంది. సీతారామం తో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఇక్కడ వరుస ఛాన్స్ లతో దూసుకెల్తుంది. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా రిలీజ్ పై చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ పొంగల్ రేసులో చాలా సినిమాలు ఖర్చీఫ్ వేసి ఉన్నాయి. సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం కన్ ఫర్మ్ రిలీజ్ అవుతుంది. కల్కి కూడా రావాల్సి ఉన్నా అది సమ్మర్ కి వాయిదా వేశారు. రవితేజ ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది. ఈ రెండు సినిమాలైతే ఇప్పటివరకు రిలీజ్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే సంక్రాంతికి విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. సంక్రాంతికి విజయ్ సినిమా అది కూడా స్టార్స్ మధ్య పోటీ అంటే రిస్క్ అనే చెప్పొచ్చు.

దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాడు అంటే సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టే లెక్క. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి ఎలాంటి డౌట్లు లేవు. విజయ్ దేవరకొండ ఖుషి హిట్ అయితే మాత్రం ఆ నెక్స్ట్ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మాత్రం పక్కా పాజిటివ్ రిజల్ట్ అందుకుంటుందని చెప్పొచ్చు. సర్కారు వారి పాట సినిమా తర్వాత పరశురాం రెండేళ్లు వెయిట్ చేసి మరీ చేసిన ఈ సినిమా మళ్లీ గీతా గోవిందం లాంటి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

పరశురాం తో పాటుగా విజయ్ గౌతం తిన్ననూరితో కూడా సినిమా చేస్తున్నాడు. జెర్సీ తెలుగు, హిందీ ల్లో చేసిన గౌతం విజయ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విజయ్ ఫ్యాన్స్ చాలా అంచనాలు ఏర్పరచుకున్నారు. ఖుషి, ఫ్యామిలీ స్టార్, గౌతం సినిమా ఇలా తన లైనప్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ది విజయ్ దేవరకొండ.