Begin typing your search above and press return to search.

VD రిటర్న్ గిఫ్ట్ చాలా కాస్ట్ లీగానే..!

సినిమా ట్రైలర్ తోనే నాగ్ అశ్విన్ వాటిని శాంపిల్ చూపించాడు. ఐతే ఈ సినిమాలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒక సర్ ప్రైజ్ క్యామియో ఉందని టాక్.

By:  Tupaki Desk   |   22 Jun 2024 1:30 AM GMT
VD రిటర్న్ గిఫ్ట్ చాలా కాస్ట్ లీగానే..!
X

కెరీర్ లో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా సరే మనకు మొదటి అవకాశం ఇచ్చిన వారిని అసలు మర్చిపోకూడదు. అలా మర్చిపోతే మాత్రం వారికి మళ్లీ ఆ రోజులు గుర్తు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఐతే కొంతమంది మాత్రం తాము ఇప్పుడున్న పొజిషన్ కి ఆరోజు వాళ్లిచ్చిన అవకాశమే అని ఆ గ్రాటిట్యూడ్ చూపించేస్తారు. ప్రస్తుతం మన రౌడీ హీరో అలాంటి గ్రాటిట్యూడ్ ని కల్కి కోసం చూపించాడని అనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.

నిన్న మొన్నటిదాకా సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేవని సోషల్ మీడియాలో ఒకటే హడావిడి చేసిన ఫ్యాన్సే సినిమా సెన్సార్ నుంచి పొందిన ప్రశంసలు చూసి మురుసిపోతున్నారు. కల్కి సినిమా ఒక గొప్ప విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని అర్థమవుతుంది. సినిమా ట్రైలర్ తోనే నాగ్ అశ్విన్ వాటిని శాంపిల్ చూపించాడు. ఐతే ఈ సినిమాలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒక సర్ ప్రైజ్ క్యామియో ఉందని టాక్.

వైజయంతి బ్యానర్ తో అనుబంధం ఉన్న యువ స్టార్స్ అంతా కూడా కల్కి కోసం పనిచేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఒక సర్ ప్రైజ్ క్యామియో స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఐతే 600 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వేరే నటుడు చేస్తే అతనికి కూడా రెమ్యునరేషన్ గా భారీగానే ఇచ్చే వారు. కానీ విజయ్ దేవరకొండ కల్కి సినిమా రెమ్యునరేషన్ లేకుండానే చేసినట్టు తెలుస్తుంది.

అంతేకాదు తనకు మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఛాన్స్ ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా విజయ్ దేవరకొండ కల్కి లో పనిచేశాడని అంటున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం చేసిన తర్వాతనే విజయ్ దేవరకొండకు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఇలా వరుస అవకాశాలు వచ్చాయి. వాటితో విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. కల్కి లో ప్రభాస్ కటౌటే అదిరిపోతుంది అనుకుంటే విజయ్ దేవరకొండ కూడా సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కల్కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఒక గొప్ప సినిమాగా అని చెప్పొచ్చు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఆడియన్స్ ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని అంటున్నారు.