Begin typing your search above and press return to search.

అప్పటి వరకు మూసుకొని కూర్చుంటా: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ.. తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయారు. తన యాటిట్యూడ్, యాక్టింగ్ తో మంచి క్రేజ్ దక్కించుకున్నారు

By:  Tupaki Desk   |   1 April 2024 1:05 PM GMT
అప్పటి వరకు మూసుకొని కూర్చుంటా: విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ.. తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయారు. తన యాటిట్యూడ్, యాక్టింగ్ తో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క స్టేట్స్ లో కూడా విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువ. ఇండస్ట్రీకి పదేళ్ల క్రితం వచ్చిన దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

కెరీర్ మొదట్లోనే సందీప్ రెడ్డి వంగా డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత గీత గోవిందంతోపాటు వరుస చిత్రాలతో హిట్లు సాధించారు. కానీ రెండేళ్ల క్రితం లైగర్ మూవీతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా ఫెయిలైంది. విజయ్ అనేక విమర్శలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఖుషితో వచ్చి పర్వాలేదనిపించారు. కానీ లైగర్ దెబ్బను పూర్తిగా పూడ్చుకోలేకపోయారు.

ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా.. ఏప్రిల్ 5న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమైంది. విజయ్ మంచి హిట్ కొట్టాలని ఫిక్స్ అయి జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్టాల్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు విజయ్.

అయితే ఎప్పుడూ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ కాస్త అగ్రిసివ్ గా మాట్లాడేవారు. కొడుతున్నాం.. బ్లాస్ట్ చేస్తున్నాం.. అనే వారు. లైగర్ టైమ్ లోనూ ఇలానే మాట్లాడారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యాక ఆయనపై చాలా ట్రోల్స్ వచ్చాయి. మరీ ఆ ప్రభావమో లేక మరో కారణమో కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో మాత్రం కూల్ గా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అలా తగ్గి ఉండడానికి గల కారణాన్ని ఇటీవల మరో ఇంటర్వ్యూలో వెల్లడించారు విజయ్.

తాను లైగర్ ముందు ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలానే ఉన్నానని చెప్పారు విజయ్. "జస్ట్ ఏంటంటే.. ఇప్పుడు సినిమా రిజల్ట్ డిక్లేర్ చేయడం లేదు. ఓ మూడు సినిమాల వరకు మూసుకుని కూర్చుంటా. నాకు నేనే శిక్ష వేసుకున్నా" అని ప్రమోషన్స్ లో తన వైఖరి మార్పుపై క్లారిటీ ఇచ్చారు విజయ్. దీని బట్టి చూస్తే ఫ్యామిలీ స్టార్ తో విజయ్ భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

అంతే కాకుండా ఇది పక్కా ఫ్యామిలీ స్టోరీ కావడంతో విజయ్ తన అగ్రిసివ్ మోడ్ ను చాలా వరకు తగ్గించేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నట్లు అర్ధమవుతుంది. అయితే విజయ్ అలా అగ్రిసివ్ గా మాట్లాడితే చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంరున్నారు. మరి కూల్ గా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు షూటింగ్ ఇదివరకే స్టార్ట్ అయ్యింది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరో రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.