Begin typing your search above and press return to search.

మావోడి కటౌట్ చూసి భయమా?

అయితే ఈ సినిమాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   8 April 2024 9:27 AM GMT
మావోడి కటౌట్ చూసి భయమా?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. టాలెంటెడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

అయితే ఈ సినిమాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ రెస్పాన్స్ ఒకలా ఉంటే, సోషల్ మీడియాలో టాక్ మరోలా ఉందని చెప్పారు. నెగిటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి అస్సలు మంచిది కాదని తెలిపారు. చాలా మంది తనకు ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని అన్నారు. నెగిటివ్ ప్రచారం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని వాపోయారు.

తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్, మేనమామ యష్ రంగినేని.. ఫ్యామిలీ స్టార్ మూవీపై సోషల్ మీడియాలో సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. తన మేనల్లుడు విజయ్ దేవరకొండ మూవీపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై మండిపడ్డారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకుంటే తప్పా అని నిలదీశారు. ఎందుకు మా వాడి వెంట పడ్డారని గట్టిగా ప్రశ్నించారు.

"ఇంత కసా? ఇంత ఓర్వలేని తనమా? లేక మావోడి కటౌట్ చూసి భయమా? ఒక మంచి విలువలతోపాటు సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాను కూడా వదలడం లేదు. మీ నెగిటివ్ బ్యాచ్ కు వాడంటే ఎలాగో పడదు. కానీ ఇష్టపడే వాళ్లను కూడా సినిమాకు రానివ్వకుండా చేస్తున్నారేంటి రా బాబు. ఇంకా ఏ హీరో సినిమాకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకు మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు" అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని పెట్టిన సోషల్ మీడియా పోస్ట్.. నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే హైదరాబాద్ మాదాపూర్ సైబర్ క్రైమ్ పోలీసులకు విజయ్ దేవరకొండ టీమ్ ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ స్టార్ మూవీపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.