అక్కడ ఉన్నది నేను, ప్రభాస్ కాదు : దేవరకొండ
యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్ల కోట్ల వసూళ్లకు చేరువగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది
By: Tupaki Desk | 1 July 2024 5:21 AM GMTగత రెండేళ్ల కాలంగా తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి సినిమా మొన్న శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సినిమా కు హిట్ టాక్ రావడంతో ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.
యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్ల కోట్ల వసూళ్లకు చేరువగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఉత్తర భారతం, ఆస్ట్రేలియా, ఇంకా పలు దేశాల్లో కూడా కల్కి సినిమా సాధిస్తున్న వసూళ్లు హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి అంటూ ఇండియన్ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమాలో ఉన్న గెస్ట్ అప్పియరెన్స్ ల గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు కనిపించిన అమితాబచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, వర్మ, రాజమౌళి ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ సినిమాకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
విజయ్ దేవరకొండ ను అర్జునుడి పాత్రలో చూపించడంను కొందరు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. అర్జునుడి పాత్రకు రౌడీ ఏమాత్రం సెట్ అవ్వలేదని, డైలాగ్ డెలివరీ మరియు బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం సెట్ అవ్వలేదు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ తో ఆ పాత్ర పై మరింత ఆసక్తి జనాల్లో పెరుగుతుంది.
తాజాగా కల్కి లో తాను పోషించిన పాత్ర గురించి విజయ్ దేవరకొండ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడాడు. కల్కి లో నేను పోషించిన పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పాత్రను నేను కేవలం నాగి తో ఉన్న స్నేహం, ప్రభాస్ పై ఉన్న అభిమానంతో చేశాను.
కనిపించింది కొద్ది సమయం అయినా కూడా అంతా మాట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని పెంచి హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంటున్న ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా కూడా ఉందని విజయ్ దేవరకొండ అన్నాడు.
సినిమాలో ప్రభాస్ పైనే బాణం వేయడం ద్వారా డామినేట్ చేశారు అంటూ ప్రశ్నించగా... అక్కడ ఉన్నది నేను ప్రభాస్ కాదు.. అర్జునుడు, కర్ణుడు. కనుక అక్కడ డామినేషన్ అనే పదానికి తావు లేదు అన్నట్లుగా విజయ్ దేవరకొండ తెలివిగా సమాధానం చెప్పాడు. మొత్తానికి కల్కి కి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా, తన పాత్ర పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.