Begin typing your search above and press return to search.

రౌడి హీరో.. వ్వాటే డేరింగ్ జర్నీ

బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకోవాలంటే ఏ రంగంలోనైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీ అయితే ఇంకా కష్టం

By:  Tupaki Desk   |   9 May 2024 3:57 AM GMT
రౌడి హీరో.. వ్వాటే డేరింగ్ జర్నీ
X

బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకోవాలంటే ఏ రంగంలోనైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీ అయితే ఇంకా కష్టం. కానీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను మెప్పిస్తూ వారు మనసులు గెలుచుకుంటున్నారు. 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.



విజయ్ దేవరకొండ సినీ జర్నీ

2011లో వచ్చిన నువ్విలా మూవీలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ.. 2012లో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా మెరిశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలు అందుకున్నారు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని విజయ్.. రిషి క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. నేచురల్ టాలెంట్ తో అందరి దృష్టిలో పడ్డారు.

ఇక 2016లో పెళ్లి చూపులు మూవీతో హీరో అయిపోయారు విజయ్. ఈ చిత్రంతో ఆయన ప్రతిభేంటో అందరికీ తెలిసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు మంచి విజయంతో పాటు మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయింది. ఆయన కెరీర్ లో బెంచ్ మార్క్ గా నిలిచింది అర్జున్ రెడ్డి మూవీ.

అయితే అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు ఈ హీరో. ఇక మళ్లీ గీత గోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కెరీర్ లో తొలి రూ.100 కోట్ల హిట్ అందుకున్నారు. టాక్సీవాలా చిత్రంతో కూడా మంచి హిట్ కొట్టేశారు. ఇక ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమా మీద విజయ్ ప్యాషన్, ఆయన చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది.

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూనే.. సమాజం కోసం తనదైన శైలిలో మంచి పనులు చేశారు. దాతృత్వంలో కూడా తన మార్క్ ను చూపించారు. కోవిడ్ సమయంలో విజయ్ నేతృత్వంలోని దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వాటితో పాటు ఇతర సహాయం కూడా చేసి శభాష్ అనిపించుకున్నారు.

అంతే కాకుండా దేవర శాంతా పేరుతో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందజేశారు విజయ్. ఖుషి మూవీ టైమ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఏటా తన ఫ్యాన్స్ లో కొందరినీ టూర్స్ కు పంపిస్తుంటారు. స్పెషల్ డేస్ నాడు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తుంటారు. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా స్టార్ హీరో అనిపించుకున్నారు విజయ్.

ఇక ఆయన అప్ కమింగ్ మూవీస్ విషయానికొస్తే.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు రవి కిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్‌ తో చెరో మూవీ చేయనున్నారు. ఈ మూడు సినిమాలు కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. మరి కొత్త చిత్రాలు బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ!