Begin typing your search above and press return to search.

రౌడీ బాయ్ Vs సల్లూ భాయ్

2025 సంక్రాంతి స్లాట్స్ బుక్ అయిపోవడంతో, అందరూ ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ మీద దృష్టి సారిస్తున్నారు

By:  Tupaki Desk   |   8 Aug 2024 6:52 AM GMT
రౌడీ బాయ్ Vs సల్లూ భాయ్
X

2025 సంక్రాంతి స్లాట్స్ బుక్ అయిపోవడంతో, అందరూ ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ మీద దృష్టి సారిస్తున్నారు. లాంగ్ వీకెండ్ చూసుకొని మంచి డేట్స్ మీద కర్చీఫ్స్ వేస్తున్నారు. స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలతో పాటుగా టైర్-2 హీరోలు నటించే కొన్ని క్రేజీ చిత్రాలు ఆల్రెడీ డేట్స్ లాక్ చేసుకున్నారు. ఒక్కొక్కరుగా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈద్ కు 'సల్లూ భాయ్ Vs రౌడీ బాయ్' క్లాష్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను సితార ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. 'పుష్ప 2' వచ్చే వేసవికి వాయిదా పదనుందని రూమర్స్ వినిపిస్తున్న టైంలో.. మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేసి, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2025 మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆగస్టులో టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పారు.

మార్చి 28 అనేది చాలా మంచి డేట్. ఎందుకంటే అదే నెల 31వ తేదీన ఈద్ పండగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. సో సోమవారం కూడా కలిసొస్తుంది కాబట్టి, విజయ్ దేవరకొండ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కాకపోతే అదే టైంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమా విడుదల కానుంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఈద్ కు తీసుకొస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

'ది ఫ్యామిలీ స్టార్' తో దెబ్బ తిన్న విజయ్ దేవరకొండ ఈసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాలని గట్టిగా కష్టపడుతున్నారు. 'VD 12' పాన్ ఇండియా మూవీ కాబట్టి, నార్త్ మార్కెట్ చాలా కీలకం. కానీ అదే సమయంలో 'సికిందర్' సినిమా వస్తే ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కు కూడా ఇది కీలకమే. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న సల్లూ భాయ్.. బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. తనకి సెంటిమెంట్ అయిన ఈద్ సీజన్ లో బరిలో దిగాలని ఫిక్స్ అయిపోయారు. దీనికి సౌత్ లో విజయ్'D మూవీ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.

రెండు మల్టీ లాంగ్వేజ్ మూవీస్ ఒకే టైమ్ లో రిలీజ్ అవుతున్నాయంటే ఎవరికైనా ఇబ్బందే. కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ సినిమాలు వచ్చిన పది రోజులకి రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ ముందుకు రానున్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'ది రాజాసాబ్' సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఈ మధ్యనే ప్రకటించారు. ఇప్పటికైతే అందరూ తమ తమ డేట్స్ మీద స్టిక్ అయి ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఏమన్నా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.