Begin typing your search above and press return to search.

రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలు.. ఆలా ఎలా వేసేస్తారు బాబాయ్!

న్యాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 9:47 AM GMT
రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలు.. ఆలా ఎలా వేసేస్తారు బాబాయ్!
X

న్యాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ అంతా సాఫీగా సాగినా అనుకోని సంఘటన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది. అలా ఎందుకు అనుకోవచ్చు. సినిమా గురించి యాంకర్ సుమ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని ప్రశ్నించే క్రమంలో సడెన్ గా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ రష్మికల ఫోటో తెర మీదకు వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో విజయ్ చిల్ అవుతూ ఉండగా.. ఆ పక్కనే రష్మిక కూడా దాదాపు అదే మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మాల్దీవ్స్ లో విజయ్ రష్మిక దిగిన ఈ ఫోటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. అదేదో పెయిడ్ ప్రమోషన్ గురించి హీరో టీం కవర్ చేసినా అప్పట్లో ఆ ఫోటోల గురించి సోషల్ మీడియాలో రచ్చ జరిగింది.

విజయ్ రష్మిక ఇద్దరు కలిసి మాల్దీవ్స్ వెళ్లారని అక్కడ ఇద్దరు సెపరేట్ గా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినా వాటిని కలిపి నెటిజన్లు హంగామా సృష్టించారు. విజయ్ రష్మిక రిలేషన్ షిప్ పై ఎన్ని వార్తలు వచ్చినా వాళ్లిద్దరు మాత్రం నోరు విప్పట్లేదు. ఇదిలా ఉంటే సడెన్ గా హాయ్ నాన్న ఈవెంట్ లో విజయ్ రష్మిక ఫోటో స్క్రీన్ మీద కనిపించే సరికి ఇటు విజయ్ ఫ్యాన్స్, అటు రష్మిక ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు.

ఆ ఫోటో స్క్రీన్ మీద రావడానికి కారణం ఆపరేటర్ తప్పిదమే అని తెలుస్తుంది. అయితే అప్పటికే యాంకర్ సుమ తన చాకచక్యంతో కవర్ చేయాలని ప్రయత్నించినా ఆడియన్స్ దాన్ని పట్టేశారు. ఇంటెన్షనల్ గా కావాలని ఆ ఫోటో వేయలేదు. కచ్చితంగా అది పొరపాటునే జరిగిందని అర్థమవుతుంది. కానీ అంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తూ ఇలాంటి తప్పిదాలు జరగడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ విషయంపై విజయ్, రష్మిక ఫ్యాన్స్ నాని మీద హాయ్ నాన్న టీం మీద ఫైర్ అవుతున్నారు.

విజయ్ నాని ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం ద్వారానే విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాంటి విజయ్ ఇమేజ్ ని నాని డ్యామేజ్ చేస్తాడని అనుకోలేం. మొత్తానికి హాయ్ నాన్న ఈవెంట్ లో జరిగిన ఈ తప్పిదంపై విజయ్ ఫ్యాన్స్ మాత్రం అప్సెట్ లో ఉండగా రౌడీ హీరో ఈ విషయంపై రియాక్ట్ అవుతాడేమో చూడాలి.