నాకే నటన నేర్పుతున్నవా.. డైరెక్టర్ పై హీరో సీరియస్
ఇదిలా ఉంటే తాజాగా ఆయన మహారాజ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
By: Tupaki Desk | 15 Jun 2024 1:31 PM GMTకోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో కూడా విజయ్ సేతుపతి నటిస్తూ మెప్పిస్తున్నాడు. గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ మూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మహారాజ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
తమిళ్, తెలుగు భాషలలో ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి గతంలో తనకి డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి మధ్య జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నేను రౌడీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మూవీలో హీరోయిన్ గా నయనతార నటించింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో విగ్నేష్ శివన్ కి విజయ్ సేతుపతికి గొడవ జరిగింది. దానిపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఆ గొడవపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఏ నటుడికి అయిన దర్శకుడితో విభేదాలు రావడం సాధారణమైన విషయం. స్క్రిప్ట్ డిస్కషన్స్ లో క్లాష్ వస్తూ ఉంటుంది. ఆయన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. నేనే రౌడీ.. సినిమా షూటింగ్ మొదటి రోజు తర్వాత ఫోన్ చేసి సీరియస్ అయ్యాను.
నువ్వు నాకు నటన నేర్పుతున్నావా… నేను చేసేది నీకు అర్ధం కావడం లేదా అని అరిచాను. తరువాత నాలుగు రోజులకి నయనతార మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది. విగ్నేష్ ఆ కథ చెప్పినపుడు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాను. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక అతన్ని అర్ధం చేసుకోవడానికి టైం పట్టింది. అలాగే మూవీలో నా పాత్రని కూడా అర్ధం చేసుకోవడానికి నాలుగు రోజులు సమయం తీసుకున్న అని విజయ్ తెలిపాడు. తరువాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని విజయ్ చెప్పుకొచ్చారు.
నేను రౌడీ సినిమా తర్వాత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి మరో సినిమా కూడా చేశాడు. కథువాకుల రెండు కాదల్ అనే మూవీ చేశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ అయ్యింది. విగ్నేష్ శివన్ సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉంటుంది. ఎవరూ టచ్ చేయని ఎలిమెంట్స్ తో సినిమాలు చేశాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది.