Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతిని పూర్తిగా వాడుకోవడానికి ఫిక్సయిన డైరెక్టర్..

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 1:30 PM GMT
విజయ్ సేతుపతిని పూర్తిగా వాడుకోవడానికి ఫిక్సయిన డైరెక్టర్..
X

సౌత్ ఇండస్ట్రీ‌తో పాటు నార్త్‌లో కూడా ప్రస్తుతం బాగా పాపులర్ అవుతున్న తమిళ్ హీరో విజయ్ సేతుపతి. విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా సినిమాలు తీయడం విజయ్ ట్రేడ్ మార్క్‌గా మారుతుంది. అందుకే అతని చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పెరుగుతోంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో గత ఎడాది విడుదలైన విజయ్ సేతుపతి విడుదల చిత్రం ఎటువంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇక ఈ మూవీకి సంబంధించి పార్ట్ 2 కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ మూవీ ‘విడుదల పార్ట్ 1’ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి‌తో పాటు కమెడియన్ సూరి,గౌతమ్ మేనన్, కిశోర్, రాజీవ్ మేనన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ‌తో కమెడియన్ సూర్య‌లో కూడా ఓ భారీ సీరియస్ యాక్టర్ ఉన్నాడు అన్న విషయం ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమయింది. ఆకట్టుకునే కథ.. ఆసక్తి రేపే కథనం‌తో పాటు అద్భుతంగా నటించే యాక్టర్స్ కలయికే ఈ చిత్రం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన రెండవ భాగం త్వరలో విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన షూటింగ్ వివరాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

ఇప్పటికే 70% కు పైగా చిత్రం షూటింగ్ పూర్తయింది.. కానీ లెక్కలను బట్టి చూస్తే ఇప్పటివరకు జరిగిన సినిమా లెంగ్త్ 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. మరి మిగిలిన 30% కూడా పూర్తి అయితే ఈ సమయం మరింత పెరిగి 6 గంటలకు చేరుకునే అవకాశం కూడా ఉంది. అంత రన్‌టైం‌తో మూవీ విడుదల చేయలేరు.. అలాగని సినిమాలో కంటెంట్ కట్ చేస్తే కథ క్వాలిటీ మిస్ అవుతుంది. దీంతో పార్ట్ 3 కి కూడా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహారాజా మూవీ ఓటీటీ పుణ్యమా అని విజయ్ సేతుపతికి మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. ఈ మార్కెట్ విలువను బాగా యూస్ చేసుకుంటూ మూడవ భాగాన్ని కూడా సిద్ధం చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు. అయితే రెండు పార్టీలకు సంబంధించిన షూటింగ్ సమాంతరంగా పూర్తి చేసి.. కాపీని ముందే సిద్ధం చేసుకుని ఉంచేలా ప్లానింగ్ చేస్తున్నారట. మళ్లీ షూటింగ్ కి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనేది డైరెక్టర్, నిర్మాత ఉద్దేశం.

ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ నక్సల్స్ విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించేవారు అనే విషయాన్ని అప్పట్లో కృష్ణవంశీ సింధూరం సినిమాలో తెరకెక్కించారు. అయితే ఆడియన్స్‌కి ఆ టైంలో అటువంటి సినిమాలు పెద్దగా రుచించలేదు. ఇప్పుడు విడుదలైన విడుదల‌కి.. అప్పుడు విడుదలైన సింధూరం‌కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కానీ రెండిటికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనలో మాత్రం అస్సలు పోలికలేదు. ఇక విడుదల పార్ట్ 2 పూర్తిగా విజయ్ సేతుపతి స్టోరీ చుట్టు నడుస్తుందట. విడుదల తర్వాత ఈ చిత్రం ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.