Begin typing your search above and press return to search.

నాంది డైరెక్టర్ మల్టీ స్టారర్.. గట్టి ప్లానే..

అల్లరి నరేష్ కి నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కనకమేడల

By:  Tupaki Desk   |   1 Aug 2024 2:30 PM GMT
నాంది డైరెక్టర్ మల్టీ స్టారర్.. గట్టి ప్లానే..
X

అల్లరి నరేష్ కి నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కనకమేడల. ఈ దర్శకుడు రెండో సినిమాని కూడా అల్లరి నరేష్ తోనే చేశారు. ఉగ్రం అనే ఆ చిత్రంలో నరేష్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ హీరోగా విజయ్ కుమార్ ఆవిష్కరించారు. అయితే మూవీ స్టోరీ పర్వాలేదనిపించుకున్న కథనం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఉగ్రం ఫ్లాప్ అయ్యింది. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని విజయ్ కుమార్ ఇప్పుడు కమర్షియల్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని లైన్ లో పెట్టాడు.

ఆయనకి కథ చెప్పి మూవీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే టైసన్ నాయుడుతో పాటు మరో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ రెండింటి కారణంగా విజయ్ కుమార్ తో సినిమా ఆలస్యం అయ్యింది. ఫైనల్ గా ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఇప్పటికే స్క్రిప్ట్ ని విజయ్ కుమార్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ మూవీగా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీలో మెయిన్ హీరోగా కనిపించబోతున్నాడంట. అలాగే ఈ మధ్య విలన్ గా టర్న్ తీసుకున్న మంచు మనోజ్ కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ ని కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసారంట. ఇందులో మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తేజ సజ్జా మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలో కూడా మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. దీంతో పాటు మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి విలన్ గా నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మల్టీ స్టారర్ గానే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్ధమవుతోంది. త్వరలో సినిమాని ప్రారంభించి వీలైనంత వేగంగా రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారంట.

ద్వితీయ విఘ్నాన్ని అధికమించలేకపోయిన విజయ్ కుమార్ కనకమేడల మూడో చిత్రంతో మాత్రం స్ట్రాంగ్ కమర్షియల్ సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నారంట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అంటే కచ్చితంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే విజయ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటాడనే మాట వినిపిస్తోంది.