ఆ స్టార్ హీరో చిత్రంలో మరో సూపర్ హీరో సృష్టి!
ఆయన జ్ఞాపకంగా ఈసినిమాని ప్రేక్షకులకు అందించినట్లుగా ఉంటుందని వెంకట్ భావిస్తున్నారుట
By: Tupaki Desk | 16 April 2024 7:28 AM GMTతలపతి విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సైన్స్ పిక్షన్ థ్రిల్లర్ `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన విజయ్ లుక్..లిరికల్ సింగిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. విజయ్ తో వెంకట్ ప్రభు కొత్త సాహసం ఏదో చేస్తున్నాడనే సంగతి అర్దమైంది. విజయ్ ని సూపర్ హీరోగా చూపించబోతున్నాడా? అన్న సందేహం ఫస్ట్ లుక్ తో రెయిజ్ అయింది. ఆ సస్పెన్స్ వీడాలంటో ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఏ ఐ టెక్నాలజీతో దివంగత నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని పున సృష్టించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో విజయ్ పాత్రతో పాటు కొంతసేపు విజయ్ కాంత్ రోల్ ని సమాంతరంగా ప్లాన్ చేస్తున్నారుట. ఆ పాత్రకి కెప్టెన్ లాంటి నటుడు మాత్రమే న్యాయం చేస్తాడని భావించి వెంకట్ ప్రభు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది.
ఆయన జ్ఞాపకంగా ఈసినిమాని ప్రేక్షకులకు అందించినట్లుగా ఉంటుందని వెంకట్ భావిస్తున్నారుట. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఏఐ కృత్రిమ మేథస్సుతో డూప్లికేట్ ని క్రియేట్ చేయడం ఎంతో ఈజీ అయిన పద్దతి. అచ్చంగా లేని వాళ్లను ఉన్నట్లుగా చూపించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇప్పటికే ఏపీ తో మార్కెట్ లో ఎలాంటివి జరుగుతున్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. సినిమాకి ఈ టెక్నాలజీ ఎంతో వినియోగ కరంగానూ కనిపిస్తుంది.
భవిష్యత్ లో మరింత మంది మేకర్స్ ఈ టెక్నాలజీని విరివిగా వాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టెక్నాలజీ హవా మార్కెట్ లో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు డూప్లికేట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. ఏఐ అందుబాటులోకి రావడంతో శ్రమ తగ్గింది. అచ్చంగా హీరోకి డూప్లికేట్ ని దించి ఒరిజినల్ సన్నివేశాల్ని తలపించే భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు.