Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్ చివరి మూవీ పుకార్లే పుకార్లు!

ప్రస్తుతం ది GOAT సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న విజయ్‌ తన చివరి సినిమాను తమిళ స్టార్‌ దర్శకుడు హెచ్ వినోత్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 5:39 AM GMT
సూపర్‌ స్టార్ చివరి మూవీ పుకార్లే పుకార్లు!
X

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టాడు. ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్టీ బలోపేతం కోసం బ్యాక్ గ్రౌండ్‌ వర్క్ చేస్తూ ఉన్నాడని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ తన అభిమాన సంఘం నాయకులను తన పార్టీ నాయకులుగా ఎంపిక చేస్తున్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళనాడు లో త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయడం మాత్రమే కాకుండా అధికారం కూడా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యూహ రచనలు సాగుతున్నాయి. అందుకోసం తన సినీ ఇమేజ్ ను విజయ్ వాడుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ది GOAT సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న విజయ్‌ తన చివరి సినిమాను తమిళ స్టార్‌ దర్శకుడు హెచ్ వినోత్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే వినోత్‌ కథ ను రెడీ చేశాడు. స్క్రిప్ట్‌ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది. తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అనుసారం వినోత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో విజయ్ ఒక పొలిటీషన్ గా కనిపిస్తాడని, లేదంటే పొలిటికల్‌ డ్రామా గా ఈ సినిమా ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు మేకర్స్ కానీ దర్శకుడు వినోత్‌ కానీ విజయ్ తో సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మీడియా లో మాత్రం పుకార్ల మీద పుకార్లు వస్తూనే ఉన్నాయి. ది GOAT సినిమా పూర్తి అయ్యి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వచ్చే నెలలో ది GOAT సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు తమిళ సినీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించబోతున్నాయి అంటూ విజయ్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి తమిళ సినీ ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు.

ది GOAT సినిమాను తమిళనాడులోని అన్ని థియేటర్‌ లలో విడుదల చేయబోతున్నారు. ప్రతి స్క్రీన్‌ లో కూడా విజయ్ సినిమా ఉండే విధంగా డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేస్తున్నారు. అదే నిజం అయితే తన పేరుతో ఉన్న అత్యధిక ఓపెనింగ్‌ కలెక్షన్స్ రికార్డు ను విజయ్ తానే బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తమిళ ఇండస్ట్రీ నుంచి వరుసగా వందల కోట్ల సినిమాలు వస్తున్నాయి. కనుక ఈ సినిమా ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను విజయ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు అందుకు తగ్గట్లుగా వర్క్ చేస్తున్నామని అంటున్నారు.

విజయ్‌ చివరి సినిమా అంటూ ఇప్పటి వరకు ఎక్కడ అధికారిక ప్రకటన రాలేదు. కానీ వినోత్‌ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న సినిమా చివరి సినిమా అంటూ పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన ప్రతిభ కనబరచలేక పోతే విజయ్ మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు లేకపోలేదు అని కొందరు అంటున్నారు. మొత్తానికి విజయ్‌ గురించి తమిళనాట ప్రముఖంగా చర్చ జరుగుతోంది.