ఏంటి.. విజయ్ 'లియో' ఫ్రీమేక్ ?
అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఫ్రీమేక్ అని అంటున్నారు.
By: Tupaki Desk | 18 Sep 2023 5:57 AM GMTకమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. ఒక్కసారిగా సౌత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. తన టాలెంట్ రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో తన డైరెక్షన్ టాలెంట్ నిరూపించుకున్న ఆయన విక్రమ్‌తో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడాయన నుంచి రాబోతున్న లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఫ్రీమేక్ అని అంటున్నారు. డేవిడ్ క్రోనెన్ బర్గ్ కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' ఆధారంగా దీన్ని దర్శకుడు లోకేశ్ తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ ఇప్పటికే చూసేశారు. ఈ సినిమాను తెలుగులో 2010లో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ రీమేక్ చేస్తూ గాయం 2 పేరుతో రిలీజ్ చేశారు. ఇది మంచిగా ఆడింది.
అయితే ఇప్పుడు 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్' చిత్రంలోని కోర్ పాయింట్‌ను తీసుకుని తనదైన స్టైల్లో తెరకెక్కించారట. ఎలాగో లోకేశ్ టాలెంట్ ఎలాంటిదో ఇప్పటికే చూశాం. కాబట్టి ఈ లియోను అద్భుతంగానే తీసి ఉంటారు.
ఇకపోతే ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషన్స్‌ను ప్రారంభించేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మంచు కొండల్లో చాలా సైలెంట్‌గా కనిపించారు. ఇంకా ఈ పోస్టర్‌పై 'మౌనంగా ఉండు, యుద్ధాన్ని నివారించు' అని కూడా రాసి ఉంది. అయితే అంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఉగ్రరూపాన్ని చూపించారు. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.
అభిమానులు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా దసరా పండగకు రిలీజ్ కానుంది. తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి , రవితేజ టైగర్ నాగేశ్వరరావులతో ఈ చిత్రం గట్టిగా పోటీ పడనుంది. చూడాలి మరి బాక్సాఫీస్ ముందు జరగబోయే ఈ త్రిముఖ పోరులో లియో ఎంత వరకు నిలబడుతుందో?