విక్రమ్ - లియోకు కనెక్షన్.. గూస్‌బంప్సే
అయితే రీసెంట్గా విక్రమ్, ఖైదీ సినిమాలకు కనెక్షన్ పెట్టి ఎల్సీయూ పేరుతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేశ్.. లియో చిత్రాన్ని కూడా ఆ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నారా?
By: Tupaki Desk | 6 Oct 2023 5:37 AM GMTవిక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ చేస్తున్న చిత్రం లియో. విజయ్ దళపతితో కలిసి ఈ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ట్రైలర్ కూడా రిలీజై ఆకట్టుకుంది.
అయితే రీసెంట్గా విక్రమ్, ఖైదీ సినిమాలకు కనెక్షన్ పెట్టి ఎల్సీయూ పేరుతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేశ్.. లియో చిత్రాన్ని కూడా ఆ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నారా? అనే ఆసక్తి సినీ ప్రియుల్లో చాలా కాలం నుంచి నెలకుంది. అందుకే లియో ట్రైలర్ కోసం ప్రతిఒక్కరూ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు.
తాజాగా విడుదలైన ప్రచార చిత్రం చూస్తుంటే విక్రమ్ రిఫరెన్స్ ఉన్నట్లు అనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సీన్లను బట్టి చూస్తే.. లియోకు ఖైదీ, విక్రమ్ సినిమాలతో సంబంధం ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అయితే అందరూ మాట్లాడుకున్నట్టే.. లియో సినిమా ఎల్సీయూలో భాగం అని సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. విక్రమ్ సినిమాలోని కొన్ని రిఫరెన్స్‌లు తీసుకుని తెరకెక్కించినట్లు పేర్కొన్నాయి.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే మరి విక్రమ్ సినిమాలో నటించిన కమల్ హాసన్ లేదా ఫహాద్ ఫజిల్ ఎవరైనా.. లియోలో కనిపిస్తారేమో చూడాలి... లేదంటే విక్రమ్‌లో ఖైదీకి కనెక్షన్ ఇస్తూనే.. కార్తి పాత్రను చూపించకుండా ఎలా నెరేట్ చేశారో అలా ఏమైనా లియోలో నెరేట్ చేస్తారేమైనా చూడాలి.
కాగా, లియో సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. విజయ్ సరసన త్రిష నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ సర్జా ఓ వైల్డ్ క్యారెక్టర్ పోషించారు. నివిన్ పాలీ, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సత్యరాజ్‌లు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లో రికార్డ్ స్థాయిలో టికెట్స్ విక్రయాలు చేసుకుంది.