Begin typing your search above and press return to search.

టైం ట్రావెల్ స్టోరిలో ద‌ళ‌ప‌తి విజ‌య్

ఆదివారం నాడు దళపతి విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసారు. దీనికి తాత్కాలికంగా దళపతి 68 అని పేరు పెట్టారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 4:05 AM GMT
టైం ట్రావెల్ స్టోరిలో ద‌ళ‌ప‌తి విజ‌య్
X

దళపతి విజయ్ నటించిన లియో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తదుపరి చిత్రం ద‌ళ‌పతి 68 మేకర్స్ ఈ సినిమా నుంచి అత‌డి లుక్ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సినిమా ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.


ఆదివారం నాడు దళపతి విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసారు. దీనికి తాత్కాలికంగా దళపతి 68 అని పేరు పెట్టారు. కానీ పోస్ట‌ర్ లో సినిమా టైటిల్‌ను కూడా వెల్లడించారు. `ఆల్ టైమ్ గ్రేటెస్ట్` అనేది టైటిల్. పోస్టర్‌లో విజయ్ రెండు విభిన్న వ‌య‌సులు క‌ల వ్య‌క్తిగా ద్విపాత్రాభినయం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైటర్ ప్లేన్ - పారాచూట్ .. వైమానిక ద‌ళ అధికారిగా యూనిఫాం ధరించి క‌నిపించాడు విజ‌య్. ``కాంతి చీకటిని మింగేయగలదు.. కానీ చీకటి కాంతిని వినియోగించదు`` అనే ట్యాగ్‌లైన్ కూడా పోస్టర్ లో ఉంది. దీనికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. `కచ్చితంగా నువ్వే ఆల్ టైం గ్రేట్ అన్నా` అని ఒక కామెంట్ రాసారు. మరొకరు ద‌ళ‌పతికి సరైన టైటిల్ అని వ్యాఖ్యానించారు. కింగ్ ఈజ్ బ్యాక్ టు స్లే అని వేరొక‌రు రాశారు. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని .. GOATలో G.O.A.T అని అభిమానులు వ్యాఖ్యానించారు. మరొకరు ``భారతీయ సినిమా నిజమైన గోట్ ఇక్కడ ఉంది`` అని రాశారు.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ ప్రభు- ద‌ళ‌పతి విజయ్‌ల కలయికలో మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరామ్, మీనాక్షి చౌదరి, యోగి బాబు త‌దిత‌రులు న‌టించారు. నిర్మాత అర్చన తన X ఖాతాలో ఫస్ట్ లుక్ గురించి ట్వీట్ చేస్తూ, “#Thalapathy68FirstLook కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అని అన్నారు.

టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందించిన చిత్రమిద‌ని ప్రచారం ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తాడు. ఒక పాత్ర‌లో 19 ఏళ్ల యువకుడిగా .. మరొక పాత్ర‌లో ఏజ్డ్ ప‌ర్స‌న్ గా క‌నిపిస్తాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.