Begin typing your search above and press return to search.

మరో బడా బ్యానర్ లో దేవరకొండ

కల్కి 2898 తర్వాత విజయ్ దేవరకొండతో మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారంట.

By:  Tupaki Desk   |   15 Sept 2023 9:24 AM IST
మరో బడా బ్యానర్ లో దేవరకొండ
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యిందనే టాక్ వచ్చింది.నిర్మాతకి ఆశించిన లాభాలు అయితే రాలేదు. కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యిందో లేదో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్నారు.

అలాగే పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాలపై చాలా హోప్స్ ఉన్నాయి. దేవరకొండ సినిమా సినిమాకి తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతన్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. అలాగే విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా నిర్మాతలు మాత్రం విజయ్ దేవరకొండతో మూవీస్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇండియన్ హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ కల్కి 2898 నిర్మిస్తోన్న వైజయంతీ మూవీస్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అగ్రిమెంట్స్ కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. కల్కి 2898 తర్వాత విజయ్ దేవరకొండతో మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారంట.

ఆలోపు దర్శకుడిని ఖరారు చేయాలని అనుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ఈ సినిమాని చేయాలని వైజయంతీ మూవీస్ నిర్మాతలైన స్వప్నా దత్, అశ్విని దత్ చూస్తున్నారంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైజయంతీ మూవీస్ లో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలలో విజయ్ దేవరకొండ నటించాడు.

ఈ స్నేహంతో హీరోగా పూర్తిస్థాయి మూవీని వారుచేయాలనుకుంటున్నారంట. మరి ఈ చిత్రానికి సంబందించిన క్లారిటీ ఇప్పుడు వస్తుందనేది చూడాలి. ఒక వేళ ఉంటే మాత్రం అది కచ్చితంగా అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ చేస్తోన్న రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. వాటి తర్వాత వైజయంతీ మూవీస్ లో సినిమా చేసే అవకాశం ఉంది.