Begin typing your search above and press return to search.

బిర్యానీ స్మెల్ కారులో వెళ్తూ ఆస్వాదించ‌డ‌మే!

తాజాగా ఈ హీరో ఆహార‌పు అల‌వాట్ల గురించి ర‌వీల్ చేసాడు. చిన్న‌ప్పుడు హాస్ట్ లో ఉన్న‌ప్పుడు ఇష్ట‌మైన వంట‌కాల్ని చాలా మిస్ అయ్యాను అంటున్నాడు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 3:30 PM GMT
బిర్యానీ స్మెల్ కారులో వెళ్తూ ఆస్వాదించ‌డ‌మే!
X

సెల‌బ్రిటీలంటే నోరు క‌ట్టుకోక త‌ప్ప‌దు. ఇష్ట‌మైన అన్ని రుచుల్ని తృప్తిగా ఆర‌గించే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ ర‌క‌మైన లైఫ్ స్టైల్ చిన్న‌ప్ప‌టి నుంచి అల‌వాటైతే ప‌ర్వాలేదు. కానీ మ‌ద్య‌లో అల‌వాటు చేసుకోవాలి అంటేనే ఇబ్బంది. రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ అలాంటి ఇబ్బంది పడిన‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్ ల నుంచి హీరోగా ఎదిగిన న‌టుడు. ఇప్పుడు పాన్ ఇండియాలో క్రేజీ స్టార్ అయ్యాడు.

తాజాగా ఈ హీరో ఆహార‌పు అల‌వాట్ల గురించి ర‌వీల్ చేసాడు. చిన్న‌ప్పుడు హాస్ట్ లో ఉన్న‌ప్పుడు ఇష్ట‌మైన వంట‌కాల్ని చాలా మిస్ అయ్యాను అంటున్నాడు. సినిమాల్లోకి వ‌చ్చాక ఫిట్ నెస్ కోసం ఇప్పుడు నోరు క‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. స‌హ‌జంగా నేను పుడీని. ఇష‌మ‌టైన ఆహారం ఏదైనా క‌డుపునిండా తింటాను. పండగ‌లు ప్ర‌త్యేక సంద‌ర్బాల్లో ఇంట్లో బిర్యానీ వండాల్సిందే. బ‌య‌ట కూడా హైద‌రాబాద్ బిర్యానీ చూస్తే అస్స‌లు ఆగ‌లేను.

ఆ వాస‌న‌లోనే ఏదో మ్యాజిక్ ఉంద‌నిపిస్తుంది. అలా కారులో వెళ్తున్న‌ప్పుడు బిర్యానీ హోట‌ల్ నుంచి ఆ స్మెల్ వ‌స్తుందంటే? ఆస్వాదిస్తున్నాను త‌ప్ప తిన‌లేక‌పోతున్నాను. బిర్యానీ అంత ఇష్టం కాబ‌ట్టే అప్పుడ‌ప్పుడున‌చ్చిన హోట‌ల్ నుంచి బిర్యానీ ఆర్డ‌ర్ పెట్టుకుంటా. బిర్యానీతో పాటు పిజ్జాలు కూడా ఉంటే కాంబినేష‌న్ బాగుంటుంది. అప్పుడే నాకు ఇష్ట‌మైన భోజ‌నం చేసిన ఫీలింగ్ క‌ల్గుతుంది.

సినిమా షూటింగ్ స‌మ‌యంలో డైట్ ప్లాన్ ఉంటే తిన‌ను. మిగ‌తా రోజులు వెయిట్ తో ఇబ్బంది ఉండదంటే? అన్ని రుచులు ఆస్వాదిస్తున్నా. కానీ స్టార్ అయిన త‌ర్వాత బిర్యానీ మాత్రం ఇంత‌కు ముందులా తిన‌లేక‌పోతున్నా' అని అన్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ 'ఫ్యామిలీ స్టార్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.