Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో భార్య ఆకస్మిక మరణం

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన ఆకస్మిక మరణం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది

By:  Tupaki Desk   |   7 Aug 2023 10:39 AM GMT
స్టార్‌ హీరో భార్య ఆకస్మిక మరణం
X

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన ఆకస్మిక మరణం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఫ్యామిలీతో పాటు విహార యాత్ర కోసం బ్యాంకాక్ కు వెళ్లారు. అక్కడ మృతి చెందారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా తమ నివాళ్లు అర్పించారు.

నటుడిగా, సింగర్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న విజయ్‌ రాఘవేంద్ర పదహారు ఏళ్ల క్రితం స్పందనను వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహ వార్షికోత్సవం జరిగింది. ఇటీవల కుటుంబ సభ్యులు విహార యాత్రకు వెళ్లడం జరిగింది. అక్కడ హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాఘవేంద్ర భార్య స్పందన మృతి చెందినట్లు ఇండస్ట్రీ వర్గాల వారు పేర్కొన్నారు.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దివంగత పునీత్ రాజ్‌ కుమార్ కి విజయ్‌ రాఘవేంద్ర దగ్గర బంధువు. పునీత్ రాజ్ కుమార్‌ 2021 లో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన స్పందన గుండె పోటుతో మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2007 సంవత్సరంలో విజయ్ రాఘవేంద్ర, స్పందన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. రాజ్‌ కుమార్ ఫ్యామిలీ హీరోల స్థాయిలో విజయ్ రాఘవేంద్ర కి కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. విజయ్ రాఘవేంద్ర నటించిన పలు సినిమాలకు స్పందన నిర్మాతగా వ్యవహరించారు. ఈమె 2017 సంవత్సరంలో ఒక సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసి అలరించింది.

స్పందన మృతి పట్ల కన్నడ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె మృతదేహం ను ఇండియా కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రేపటి వరకు బెంగళూరుకు ఆమె మృతదేహం చేరుకునే అవకాశం ఉంది.