Begin typing your search above and press return to search.

ఇదిగో ప్రూఫ్‌.. గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ

గత రాత్రి ర‌ష్మిక తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషకర క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:44 AM GMT
ఇదిగో ప్రూఫ్‌.. గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ
X

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మందన జంట‌పై నెటిజ‌నుల్లో సాగుతున్న ప్ర‌చారం గురించి తెలిసిందే. ఈ జంట సీక్రెట్ వెకేష‌న్స్ గురించి చాలా ఆరాలు కొన‌సాగున్నాయి. కానీ ఆ ఇద్ద‌రూ తాము మంచి స్నేహితులం మాత్ర‌మేనని చెబుతున్నారు.

గత రాత్రి ర‌ష్మిక తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషకర క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ త‌న‌ కుటుంబంతో క‌లిసి దీపావళి జరుపుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు ఇద్దరు నటులు పోస్ట్ చేసిన ఫోటోల‌ మధ్య సారూప్యతలను గమనించారు. వారు ఉమ్మడిగా కలిసి దీపావ‌ళి జ‌రుపుకున్నారు. కానీ క‌లిసి ఉన్న ఫోటోల‌ను మాత్రం షేర్ చేయ‌లేదు. ఈ ఫోటోలు చూస్తుంటే జంట‌గా దీపావళి వేడుకను జ‌రుపుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోల‌తో మరోసారి వారి మ‌ధ్య అనుబంధంపై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ జోడీ దాని గురించి పెదవి విప్పలేదు.ఇదిగో ప్రూఫ్‌.. గీత‌-గోవిందం దీపావ‌ళి పార్టీ అంటూ అభిమానులు ఈ ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.

వృత్తిపరంగా చూస్తే.. విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. చిత్ర‌బృందం విదేశాలలో కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. మ‌రోవైపు ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. రష్మిక బాలీవుడ్ డెబ్యూ 'గుడ్‌బై' అక్టోబర్ 7నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో కనిపించింది. మరిన్ని హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్‌లో ఆమెను చూడాలని అందరూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో యానిమ‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. అలాగే పుష్ప 2లోను శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంది. ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంగా రికార్డుల్లో ఉంది.