విజయ్-రష్మిక ఎంగేజ్ మెంట్ పై తుపాకీతో క్లారటీ!
దీంతో నెటిజన్లు ఆ ఫోటోలను పరిశీలించి వారిద్దరూ పోస్ట్ ఫోటోలో ఉన్న ప్లేస్ ఒక్కటేనని నిర్దారించేసారు
By: Tupaki Desk | 8 Jan 2024 1:01 PM GMTవిజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమ వివాహం చేసుకుంటున్నట్లు..ఫిబ్రవరిలో నిశ్చితార్దం ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు ఒక్కసారిగా బాలీవుడ్ బాలీవుడ్ వెబ్ సైట్లు సహా... సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ సంబంధించిన ఫోటోలు రష్మిక షేర్ చేసింది. అలాగే విజయ్ కూడా తన కుటుంబంతో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు పోస్ట్ చేశారు.
దీంతో నెటిజన్లు ఆ ఫోటోలను పరిశీలించి వారిద్దరూ పోస్ట్ ఫోటోలో ఉన్న ప్లేస్ ఒక్కటేనని నిర్దారించేసారు. రష్మిక- విజయ్ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ఇద్దరు సిద్ధమైనట్లు నెట్టింట ప్రచారం జోరందుకుంది. అయితే ఇవన్నీ అవాస్తవాలు అని విజయ్ దేవరకొండ టీమ్ కాసేపటి క్రితమే కన్పమ్ చేసింది.
తుపాకీ. కామ్ విజయ్ టీమ్ ని సంప్రదించగా...సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తే అవన్నీ తప్పుడు కథనాలని ఖండించారు. విజయ్ టీమ్ లో ఒకరు వీటన్నింటిని తప్పుడు కథనాలుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో విజయ్-రష్మిక ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారు అన్నది పచ్చి అవాస్తవమని తేలిపోయింది. ప్రస్తుతం విజయ్ -రష్మిక ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు క్యూలో ఉన్నాయి. ఇక రష్మిక మందన్న ఇటీవలే 'యానిమల్' తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. అలాగే తెలుగులో 'పుష్ప-2' సినిమా చేస్తోంది. మరోవైపు అమ్మడి చేతిలో కొన్ని హిందీ అవకాశాలున్నట్లు తెలుస్తోంది.