సమంత అనారోగ్యానికి విజయ్ కారణమా!
అయితే ఆ వెంటనే సదరు మీడియా ప్రతినిధి.. సమంత అనారోగ్యానికి మీరే కారణమా అంటూ తిరిగి ప్రశ్న సంధించారు.
By: Tupaki Desk | 24 Aug 2023 5:22 AM GMTఖుషి మూవీ ప్రమోషన్ల కోసం ఇతర రాష్ట్రాలు కూడా తిరుగుతున్న ది విజయ్ దేవకొండకు అక్కడి మీడియా నుంచి వరుసగా ఇరికించే ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అయినా విజయ్ చాలా తెలివిగా ఎంతో పరిణితితో సమాధానం ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయ్ వ్యవహరిస్తున్న తీరు బాగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా విజయ్‌కు మరో కాంట్రవర్సీ క్వశ్చన్ ఎదురైంది.
అంతకుముందు విజయ్.. లైగర్ ప్రమోషన్స్‌లో ఎలా బిహేవ్ చేశారో చూశాం. కానీ ఇప్పుడు ఖుషి కోసం లో ప్రొఫైల్ ప్రమోషన్ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇంటరాక్షన్స్ లిమిటెడ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా చెన్నై మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ కోలీవుడ్ జర్నలిస్ట్ అనవసరమైన కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అందులో జర్నలిస్ట్.. ఖుషి ఎందుకు లేట్ అయింది అని అడగగా.. సమంత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అని విజయ్ చెప్పారు. అయితే ఆ వెంటనే సదరు మీడియా ప్రతినిధి.. సమంత అనారోగ్యానికి మీరే కారణమా అంటూ తిరిగి ప్రశ్న సంధించారు. తక్షణమే అక్కడి లేడీ హోస్ట్ ఎంటరై.. కన్వర్జేషన్‌ను మార్చేసి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేసింది.
అలాగే అంతకుముందు కూడా ఓ కోలీవుడ్ జర్నలిస్ట్... మీకు తమిళ దర్శకులు లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల గురించి అంతగా తెలియదు కదా అంటూ ప్రశ్న అడిగాడు. సదరు విలేఖరి అడిగిన ప్రశ్నకు విజయ్ తన దైన స్టైల్లో సమాధానమిచ్చారు. అరుణ్ ప్రభుని చాలా ఇష్టపడతాను, ఇంతకీ అతనెవరో నీకు తెలుసా అంటూ రివర్స్ కౌంటర్ స్లోగా వేశారు. అలాగే శ్రీకార్తిక్ ప్రస్తావన, అరుణ్ మాతేశ్వరన్ దర్శకుల పేర్లను కూడా చెప్పారు. దీంతో సదరు జర్నలిస్తు నోరు మూసుకోవాల్సి వచ్చింది.
ఏదేమైనప్పటికీ కోలీవుడ్ మీడియా నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడంతో.. విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అవగాహన ఉండే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా అంటూ మండి పడుతున్నారు. అలాగే విజయ్ సమాధానం ఇచ్చిన తీరును ప్రశంసిస్తున్నారు. ఇకపోతే విజయ్ డియర్ కామ్రేడ్, లైగర్ వంటి చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సారి ఖుషితో గీత గోవిందంను మించిన సక్సెస్ అందుకుంటారని ఆశిస్తున్నారు.