Begin typing your search above and press return to search.

ఉప్పెన పాపతో రొమాన్స్.. సేతుపతి ఏమన్నారంటే..

కృతి ఫోటో చూడగానే, ఈ అమ్మాయికి నేను తండ్రి పాత్ర చేశాను, తను నాకు కూతురులాంటిది, తనతో నేను రొమాంటిక్ సీన్లు చేయలేను అని మొహమాటం లేకుండా చెప్పేశారట.

By:  Tupaki Desk   |   23 Sep 2023 12:30 PM GMT
ఉప్పెన పాపతో రొమాన్స్.. సేతుపతి ఏమన్నారంటే..
X

వయసు మళ్లిన హీరోలు అయినా, తమ పక్కన యంగ్ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సీనియర్ హీరోల పక్కన చేసే హీరోయిన్ల వయసు చాలా తక్కువ ఉంటోంది. మరీ ముఖ్యంగా వాళ్ల కూతురి వయసు ఉంటోంది, అలా ఉన్నా, వారు ఏ మాత్రం మొహమాట పడకుండా, రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి మాత్రం చాలా భిన్నం.

ఎందుకంటే, ఆయనకు ఓ యంగ్ హీరోయిన్ తో నటించే ఛాన్స్ వస్తే, వెంటనే వద్దు అనేశారు. ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. ఈ ఉప్పెన మూవీలో కృతి శెట్టికి ఆయన తండ్రి పాత్ర పోషించారు. ఆ మూవీ తర్వాత కొంతకాలానికే, ఆయనకు ఓ తమిళ మూవీలో హీరోగా ఆఫర్ వచ్చింది. అందులో ఆ మూవీ టీమ్ హీరోయిన్ గా కృతిని సెలక్ట్ చేశారు.

అయితే, ఆ విషయం తర్వాత విజయ్ సేతుపతికి తెలిసింది. కృతి ఫోటో చూడగానే, ఈ అమ్మాయికి నేను తండ్రి పాత్ర చేశాను, తను నాకు కూతురులాంటిది, తనతో నేను రొమాంటిక్ సీన్లు చేయలేను అని మొహమాటం లేకుండా చెప్పేశారట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ రోజుల్లో ఓ సినిమాలో అన్నగా, మరో సినిమాలో తండ్రి చేయడం కామన్ అని, ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన అంగీకరించలేదట.

ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేసే సమయంలో కృతి చాలా ఇబ్బంది పడిందట. అప్పుడు విజయ్ సేతుపతి ఆమెకు ధైర్యం చెప్పారట. నాకు నీ వయసు కొడుకు ఉన్నాడు, నువ్వు నా కూతురులాంటి దానివి. కాబట్టి, నన్ను నీ తండ్రి అనుకొని నటించు అని చెప్పారట. అలా చెప్పిన తర్వాత కూడా ఆమె పక్కన హీరోగా చేయలేను అని చెప్పారట. ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు.

ఆయన క్యారెక్టర్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. 96 మూవీలోనూ త్రిష తో లిప్ లాక్ సీన్ పెట్టాలని డైరెక్టర్ అనుకుంటే, ఆయన దానికి కూడా నిరాకరించారు. ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత ఆయన పై గౌరవం మరింత పెరిగింది అంటూ, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.