Begin typing your search above and press return to search.

మక్కల్ సెల్వన్ మాస్టర్ పీస్ కామెంట్స్..!

ఈ సినిమా విషయంలో తన ఇన్ పుట్స్ తీసుకుని చిత్ర యూనిట్ బాగా పనిచేశారని ఈ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ తను పాపకి ఇస్తానని అన్నారు విజయ్ సేతుపతి.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:54 PM GMT
మక్కల్ సెల్వన్ మాస్టర్ పీస్ కామెంట్స్..!
X

విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నితిలన్ సామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహారాజ. ఫ్రై డే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఐతే ఈ థ్యాంక్స్ మీట్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది. రిలీజ్ ముందు ఇక్కడికి వస్తే మీడియా తో పాటుగా ప్రేక్షకులు కూడా చాలా లవ్ చూపించారు. ఆ టైం లో కాస్త భయం వేసింది. అసలు సినిమా కనీసం యావరేజ్ ఆడినా చాలని అనుకున్నా కానీ ఈ సినిమాను చాలా పెద్ద సక్సెస్ చేశారని అన్నారు విజయ్ సేతుపతి.

తనను తెలుగు ఆడియన్స్ ఎక్కడ నుంచో వచ్చిన వాడిలా కాకుండా ఇక్కడ హీరోనే అనుకుని ఎంకరేజ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ తనను ఎక్కడ కనిపించినా సరే 96, ఉప్పెన సినిమాల గురించి మాట్లాడుతుంటారని అన్నారు. తామొక పీస్ సినిమా చేశాం కానీ మీరు దాన్ని మాస్టర్ పీస్ చేశారని అన్నారు విజయ్ సేతుపతి. ఈ సినిమా విషయంలో తన ఇన్ పుట్స్ తీసుకుని చిత్ర యూనిట్ బాగా పనిచేశారని ఈ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ తను పాపకి ఇస్తానని అన్నారు విజయ్ సేతుపతి.

అంతేకాదు సినిమా గురించి మాట్లాడటానికి ఇంతమంది దర్శకులు రావడం సంతోషంగా ఉందని మంచి విషయాలు చెప్పడానికి మంచి మనసు కావాలని అంటారు ఈ దర్శకులందరికీ థ్యాంక్స్ అని అన్నారు విజయ్ సేతుపతి. చాలా కాలం తర్వాత బుచ్చి బాబుని చూశా తన నెక్స్ట్ సినిమా చరణ్ తో చేస్తున్నాడు. తను నాకు తమ్ముడు లాంటివాడని అన్నారు.

కంటెంట్ ఉన్న సినిమాలనే విజయ్ సేతుపతి చేస్తాడని మరోసారి మహారాజతో ప్రూవ్ అయ్యింది. సినిమా ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని.. సినిమా చూసిన వారంతా ఆ వైబ్ లో ఉండిపోతారని అతిథులుగా వచ్చిన దర్శకులు మారుతి, గోపీచంద్ మలినేని, అనిల్ లాంటి వారు చెప్పారు. జూన్ 14న రిలీజైన సినిమాల్లో సుధీర్ బాబు హరోం హర సినిమా కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా మహారాజ సినిమా కు మౌత్ టాక్ బాగుండటం వల్ల సినిమా వసూళ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.