Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి కూతురు గురించి తెలుసా..?

ఇండస్ట్రీలో గుర్తింపు దక్కక ముందే విజయ్ సేతుపతికి జెస్సీ అనే అమ్మాయితో వివాహం అయింది. 2003 లో వీరి వివాహం జరిగింది

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:06 AM GMT
విజయ్ సేతుపతి కూతురు గురించి తెలుసా..?
X

విలక్షణ నటుడిగా పేరు దక్కించుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌ గా ఏడాదికి డజనుకు పైగా సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన చాలా అరుదుగా మాత్రమే ఫ్యామిలీ తో బయట కనిపించడం మనం చూస్తూ ఉంటాం. దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో గుర్తింపు దక్కక ముందే విజయ్ సేతుపతికి జెస్సీ అనే అమ్మాయితో వివాహం అయింది. 2003 లో వీరి వివాహం జరిగింది. విజయ్ సేతుపతి మరియు జెస్సీ కి సూర్య, శ్రీజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ ఇద్దరు కూడా ఇప్పటికే వెండి తెరపై కనిపించారు, ఆ సమయంలో వారు విజయ్ సేతుపతి పిల్లలు అనే విషయం ప్రకటించలేదు.

నేను రౌడీనే అనే సినిమాలో అబ్బాయి సూర్య చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా కనిపించాడు. ఇక విజయ్ సేతుపతి 2020 సంవత్సరంలో నటించిన ముగిల్ సినిమా లో శ్రీజ కీలక పాత్రలో కనిపించింది. నిజ జీవిత తండ్రి కూతురు అయిన వీరు సినిమాలో కూడా అలాగే కనిపించారు. ఆ సమయంలో శ్రీజ గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆ సమయంలో విజయ్ సేతుపతి కూతురు అనే విషయం కొద్ది మందికి మాత్రమే రివీల్ చేయడం జరిగింది.

విజయ్ సేతుపతి విలక్షణ నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన పిల్లలు ఇద్దరు కూడా తప్పకుండా నటనతో గుర్తింపు దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తప్పకుండా శ్రీజ త్వరలోనే నటిగా ఎంట్రీ ఇవ్వాలని, హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు.