Begin typing your search above and press return to search.

మనోళ్ళ వల్ల కాలేదు.. సేతుపతి కొట్టి చూపించాడు

వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి

By:  Tupaki Desk   |   19 Jun 2024 11:30 AM GMT
మనోళ్ళ వల్ల కాలేదు.. సేతుపతి కొట్టి చూపించాడు
X

వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన పరకాయ ప్రవేశం చేసి స్క్రీన్ పై అద్భుతమైన ప్రెజెన్స్ తో ఆకట్టుకోవడం విజయ్ సేతుపతి నైజం. అందుకే భాషలతో పరిమితం లేకుండా విజయ్ సేతుపతి అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. అతని పెర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్డ్ గా ఉంటుంది. ఎక్కడా డ్రామా క్రియేట్ చేస్తున్నట్లు అనిపించదు.

అందుకే విజయ్ సేతుపతికి యాక్టింగ్ పరంగా చాలా ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది హిందీలో జవాన్ మూవీలో విజయ్ పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు. తాజాగా మహారాజ మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో అతను హీరోగా నటించాడు. జూన్ 14న తమిళ్, తెలుగు భాషలలో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

తమిళంలో సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక తెలుగులో కూడా విజయ్ సేతుపతికి మహారాజతో సూపర్ హిట్ రాబోతోంది. విజయ్ సేతుపతి కెరియర్ ఆరంభంలో చేసిన పిజ్జా సినిమా తెలుగులో హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మహారాజ రూపంలో తెలుగులో హీరోగా మరో సక్సెస్ పడింది. సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మౌత్ టాక్ తో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇకపై వచ్చే కలెక్షన్స్ అంతా లాభాల్లోనే ఉండబోతోంది. గత రెండు నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కమర్షియల్ హిట్ పడలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి ఆగిపోయాయి. మనమే మూవీ కూడా ఇంకా క్లీన్ హిట్ అనిపించుకునే కలెక్షన్స్ సాధించలేదు.

చివరిగా తెలుగులో మలయాళీ డబ్బింగ్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ క్లీన్ హిట్ గా నిలించింది. మరల రెండు నెలల తర్వాత డబ్బింగ్ సినిమాతోనే హిట్ వచ్చింది. తెలుగు సినిమాలు మాత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం లేదు. టాలీవుడ్ నుంచి సరైన కమర్షియల్ హిట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కల్కి2898ఏడీతో ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.