Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి.. తెలుగు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే..

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన మూవీ మహారాజ. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:09 AM GMT
విజయ్ సేతుపతి.. తెలుగు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే..
X

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన మూవీ మహారాజ. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయ్యింది. నితైలన్ సామినాథన్ దర్శకత్వంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా థియేటర్స్ లోకి వచ్చిన మహారాజ మొదటి రోజు మొదటి ఆటకే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో మౌత్ టాక్ పెరిగి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. విజయ్ సేతుపతికి హీరోగా తెలుగులో ఫస్ట్ సక్సెస్ పిజ్జా సినిమాతో వచ్చింది. దాని తర్వాత విజయ్ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. అయితే ఏ ఒక్కటి మెప్పించలేదు. మరల చాలా కాలం తర్వాత మహారాజ మూవీతో తెలుగులో సూపర్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. పబ్లిక్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.

జూన్ 14న రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాయి. అయితే మహారాజ మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. అటు తమిళంలో కూడా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలో రెండో రోజు మహారాజ మూవీకి 2 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. మూడో రోజు కొద్దిగా పెరిగి 2 లక్షల 7 వేల టికెట్లు అమ్ముడు కావడం విశేషం. నాలుగో రోజు కూడా ఆ ఇంపాక్ట్ కనిపించింది.

దీనిని బట్టి ఈ సినిమా పబ్లిక్ ని ఏ స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 5.95 కోట్ల గ్రాస్ ని మహారాజ అందుకుంది. ఇక షేర్ కలెక్షన్స్ 2.95 కోట్లు. నైజాంలో 1.42 కోట్లు, ఆంధ్రాలో 1.05 కోట్లు, సీడెడ్ లో 48 కోట్ల గ్రాస్ ని మహారాజ ఇప్పటి వరకు అందుకుంది. సోమవారం సెలవు రావడంతో కలెక్షన్స్ మరింతగా పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

3.55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మహారాజ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రీ శశి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. కచ్చితంగా ఈ మూవీతో మంచి లాభాలని సొంతం చేసుకునే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. విజయ్ సేతుపతికి హీరోగా ఈ చిత్రంతో సాలిడ్ సక్సెస్ వచ్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక భవిష్యత్తులో సేతుపతికి టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.